*సమస్యలు ఏమైనా ఉంటే హెచ్ఎం కి తెలియజేయండి*
*జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్*
శ్రీకాకుళం, జూలై 31: నందిగాం లోని అంబేడ్కర్ గురుకులంలో ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. అని వచ్చిన వార్తకు తక్షణం స్పందించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఎస్పీ వారికి,పలాస రెవిన్యూ డివిజనల్ అధికారి వారికి దర్యాప్తు చేయవలసినదిగా సూచిస్తూ, టెక్కలి రెవెన్యూ డివిజనల్ అధికారి తక్షణం కొత్తూరు వెళ్లి దర్యాప్తు చేయవలసిందిగా ఆదేశించారు. జిల్లా కోఆర్డినేటర్ బాలాజీ నాయక్ తక్షణం నందిగాం గురుకుల పాఠశాలకు వెళ్లి ఆరా తీయవలసిందిగా ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థినులు ధైర్యంగా ఉండాలని, అధైర్య పడవద్దని, సమస్యలు ఏమైనా ఉంటే హెచ్ఎంకి తెలియజేయాలన్నారు.
అందులో భాగంగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతిశ్రీ వారికి నందిగాం గురుకుల పాఠశాలకు వెళ్ళవలసిందిగా ఆదేశించారు వెంటనే ప్రాజెక్ట్ డైరెక్టర్ పాఠశాలకు వెళ్లి పిల్లలకు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేసి వారి మనోధైర్యాన్ని కల్పించారు. అలాగే వన్ స్టాప్ సెంటర్ ఏర్పాటు చేసి వారికి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుందని విద్యార్థులు సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయి నిమిత్తం టోల్ ఫ్రీ నెంబర్ 1098 ఏర్పాటు చేయనున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ అన్నారు.
జిల్లాలో అందరూ వసతిగృహముల వార్డెన్లు, ప్రధానోపాధ్యాయులు ఇటువంటివి పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
0 Comments