ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

వ్యవ 'సాయం' చేద్దాం: జిల్లా కలెక్టర్

శ్రీకాకుళం, జూలై 29 : అత్యధిక శాతం మంది జిల్లా నుంచి వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నందున చిత్తశుద్ధితో వారి అభివృద్ధికి అన్ని విధాల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో వ్యవసాయం దాని అనుబంధ శాఖలైన హార్టికల్చర్‌, సెరికల్చర్‌, పశుసంవర్ధక శాఖ, ఫిషరీస్‌, మార్కెటింగ్‌, కో-ఆపరేటివ్‌, బ్యాంకర్లు తదితర శాఖల గురించి సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ తో కలసి సోమవారం సాయంత్రం ఆయన సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అందించే ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన తీసుకుంటున్న చర్యలపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అన్ని విధాల అన్నదాతకు అండగా నిలబడాలని, రైతులకు క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈసారి జిల్లాలో 1,82,325 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేసే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఇందులో వరి 1,51,500 హెక్టార్లు, మొక్క జొన్న 10,000 హెక్టార్లు ప్రధానంగా సాగు చేయడం జరుగుతుందని, అవసరమైన విత్తనాలు, ఎరువులు పంపిణీ చేసినట్టు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కే శ్రీధర్ తెలిపారు. పి.ఎం. కిసాన్ కింద జిల్లాలో 2.29 లక్షల మంది రైతులకి రూ.45.8 కోట్లు నిధులు వారి వారి ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. 

 సమావేశంలో పలు శాఖల లక్ష్యం, సాధించిన ప్రగతి, సిబ్బంది నమూనా, పనితీరు తదితర అంశాల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పశుసంవర్ధక శాఖ జేడీ జయరాజు, మత్స్య శాఖ డిడి శ్రీనివాసరావు, మార్క్ ఫెడ్ డిఎం రమణి, సెరికల్చర్ ఆఫీసర్ రాజేంద్ర ప్రసాద్ బాబు, ఉద్యానవన శాఖాధికారి అర్.వి.వి.ప్రసాద్, మార్కెటింగ్ ఏడి గంగాధర్, డిసిసిబి సీఈవో వరప్రసాద్, లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్య కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments