👉వచ్చే నెల 9,10 తేదిలలో విజయనగరం వేదికగా రాష్ట్ర స్థాయి పోటీలు
👉జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులు ఎంపిక
👉ఉత్సాహంగా జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు
👉పోటీలను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఉపాధ్యక్షులు తైక్వాండో శ్రీను
శ్రీకాకుళం స్పోర్ట్స్ న్యూస్:
రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకి జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. వచ్చే నెల 9,10 తేదిలలో విజయనగరం వేదికగా రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు జరుగనుండగా జిల్లా స్థాయిలో సోమవారం జట్టు ఎంపికలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆద్వర్యంలో టౌన్ హాల్ వేదికగా జరిగిన పోటీలలో జిల్లా నలుమూలల నుంచి విచ్చే క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలను ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషణ్ ఉపాధ్యక్షులు తైక్వాండో శ్రీను ప్రారంభించారు. ఈ సందర్భంగా తైక్వాండో శ్రీను మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలకి ఎంపికైన క్రీడాకారులు అక్కడ ప్రతిభ కనబరచి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు ఉజ్వలభవిష్యత్ ఉంటుందన్నారు. నిరంతరం శిక్షణను తీసుకోవడం ద్వారా మెళకువలను నేర్చుకుని పోటీలలో రాణించేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లాకి చెందిన క్రీడాకారులు గతంలో ఎన్నో పతకాలను సాధించారన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర స్థాయి పోటీలలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఉత్సాహంగా జరిగిన ఈ పోటీలలో ప్రతిభ కనబరచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకి ఎంపికచేసారు. ఈ మేరకు జూనియర్ బాలికల విభాగంలో అండర్ 42 కె.జిల విభాగంలో బండి శిరీష, ఎబౌవ్ 68 కె.జిల విభాగంలో శిమ్మ నవ్య, అండర్ 68 కె.జిల విభాగంలో గొల్లంగి దుర్గా భవానీ లు ఎంపికయ్యారు. అదేవిదంగా జూనియర్ బాలుర విభాగంలో అండర్ 45 కె.జిల విభాగంలో దనాల అక్షయ్ కుమార్ ,అండర్ 59 కె.జిల విభాగంలో రవ్వ వెంకట ప్రీతమ్ లు ఎంపికయ్యారు. జిల్లా స్థాయి పోటీలకు న్యాయ నిర్ణేతలుగా తైక్వాండో గౌతమ్ ,సాయిబాలాజీ,గణసాయిలు వ్యవహరించగా కోచ్ లు తైక్వాండో నవీన్ ,శాప్ కోచ్ లక్ష్మణ్ ,జోగిపాటి వంశీలు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులను వచ్చే నెల 17 నుంచి 20 వరకూ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో జరిగే 41వ నేషనల్ జూనియర్ కుర్గీ,13వ నేషనల్ పూమ్ సే తైక్వాండో చాంపియన్ షిప్ పోటీలలో పాల్గొంటారు.
0 Comments