శ్రీ కాకుళం విలీన పంచాయితీల్లో 'చట్ట వ్యతిరేక 'ఆస్తిపన్ను పెంపుదలను ఉపసంహరించాలని 'శ్రీకాకుళం టేక్స్ పేయర్స్ అసోసియేషన్' అధ్యక్ష కార్యదర్శులు తమ్మన భాస్కర్, మణికొండ ఆదినారాయణమూర్తి డిమాండ్ చేశారు.
ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం జి.ఒ.నెం.198 తేదీ 24/11/20 ద్వారా ఆస్తి పన్ను లెఖ్ఖింపు విధానం అద్దె విలువ ఆధారిత ఆస్తి పన్ను బదులుగా ఆస్తి విలువ ఆధారిత ఆస్తిపన్నుగా మార్చి , 1/4/20 నుండి అమలు చేసిందన్నారు. దీని ప్రకారం ప్రతి సంవత్సరం ఆస్తి పన్ను పెరుగుతుంది ఈ విధంగా గత నాలుగు సంవత్సరంలో కాంపౌండింగ్ పద్ధతిలో సుమారు 75% ఆస్తిపన్ను పెరిగిందన్నారు.
ఇందుకు అదనపు భారంగా, శ్రీకాకుళం విలీన పంచాయతీలు చాపరం, పెద్దపాడు, పాత్రునివలస, కాజీపేట,కిల్లిపాలెం, తోటపాలెం,కుశాలపురం లలో అనేకమంది ఆస్తి పన్ను చెల్లింపుదారులకు
నాలుగు సంవత్సరాలలో సుమారు 350% అయింది. అనగా 250% పెరిగింది.ఉదాహరణకు అసెస్మెంట్ నెంబర్ 1085042867 కు 2020-21 సంవత్సరం ఆస్తి పన్ను రూ.1606 కాగా 2024-25 సంవత్సరంr ఆస్తిపన్ను రూ. 5326/- (332%) అయింది. అసెస్మెంట్ నెంబర్1085034716 కు 2020-21 సంవత్సరం ఆస్తి పన్ను రూ. 1669 కాగా 2024-25 సంవత్సరమునకు రూ.5838/-(350%) అయింది అని తెలిపారు.
పైన పేర్కొన్న జి.ఒ నెం198 పేరా 9 ప్రకారం, ప్రతి సంవత్సరం పెంపుదల 15% మించరాదు. అనగా కాపౌండింగ్ పద్దతిలో సుమారు 75% మించరాదు. కానీ పై ఉదాహరణలలో పెంపుదల సుమారు 250% ఉంది. అందుచేత ఇది చట్ట విరుద్ధం అన్నారు.
ఇటువంటి కేసులు శ్రీకాకుళ మునిసిపల్ కార్పోరేషన్ విలీన పంచాయతీలలో వందలాది ఉన్నాయి. వీటి పై భాధితులు మునిసిపల్ కార్యాలయంలో వ్రాత పూర్వక ఫిర్యాదులు చేసారు. సంవత్సరాలు గడుస్తున్నాయి. తప్ప సరిచేయబడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
0 Comments