ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

సమస్యలు పరిష్కరించి ప్రగతిని సాధించాలి

శ్రీకాకుళం: సమస్యలు పరిష్కరించి ప్రగతిని సాధించాలని, అందిన అర్జీలకు నాణ్యతతో కూడిన సత్వర పరిష్కారాన్ని అందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. 
సోమవారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) మీకోసం కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది"ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి 200 అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో పాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహమద్ ఖాన్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతి రావు, డిఆర్డిఎ, పి.డి కిరణ్, సిఈఓ జిల్లా పరిషత్ వెంకటేశ్వర రావు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రద్ద, అంకిత భావంతో పనిచేసి జిల్లాను ఉన్నత స్థానంలో నిలపాలని అన్నారు. ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పనిచేద్దాం - లక్ష్యాలు సాధిద్దాం అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు, జిల్లాలో దృష్టి సారించాల్సిన అంశాలపై శ్రద్ద వహించాలని ఆయన సూచించారు.  

ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్ మెంట్ ఇవ్వాలని తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న సమస్యలను అధిగమించి, ప్రగతిని సాధించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జిల్లా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ప్ర‌జ‌ల సంక్షేమం కోసం అమ‌లుచేస్తున్న వివిధ సంక్షేమ ప‌థ‌కాలు, రెవెన్యూ, పౌర సర‌ఫ‌రాల సేవ‌లు, పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ వారికి అర్జీలు సమర్పించారు.

మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో కెఆర్సి ప్రత్యేక ఉప కలెక్టర్ సుదర్శనదొర, ఐసిడిఎస్ పిడి శాంతిశ్రీ, డిఎంఅండ్ హెచ్ఓ డా బి. మీనాక్షి, డిసిహెచ్ఎస్ డా రాజ్యలక్ష్మి, ఎస్సి కార్పొరేషన్ ఇ.డి గడెమ్మ, వెనుకబడిన తరగతులు సంక్షేమ అధికారిణి అనురాధ, విభిన్న ప్రతిభవంతుల అధికారిణి కవిత తదితరులు పాల్గొన్నారు. డ్వామా పి.డి చిట్టి రాజు, జిల్లా ఉద్యాన అధికారి ఆర్.వి ప్రసాద రావు, ఎల్డిఎం సూర్య కిరణ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments