ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

అణు విద్యుత్ వ్యతిరేక ఉద్యమ కారులపై పెట్టిన కేసు కొట్టివేత.


శ్రీకాకుళం: కొవ్వాడ అణువిద్యుత్తు కేంద్రం రద్దు చేయాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని కృషి చేస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సంజీవని పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షులు కూన.రామం, సిఐటియు జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు సి.హెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావులపై చెన్నై నుండి పర్యావరణ పరిరక్షణ సభ్యులను తెచ్చి గ్రామాలలో ప్రజలను రెచ్చగొట్టారని, భూసర్వేలకు ఆటంకం కలిగించారని అభియోగంపై 2016లో పెట్టిన కేసును తగిన సాక్ష్యాధారాలతో నిరూపించకపోవడంతో ఎక్సైజ్ మెజిస్ట్రేట్ కోర్టు కేసును కొట్టివేసారు. ఈ కేసును న్యాయవాది దుంపల.రమణారావు వాదించారు.

Post a Comment

0 Comments