శ్రీకాకుళం: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ విద్యావిధానంలో భాగంగా విద్యాభివృద్ధికే శిక్షా సప్తాహ్ కార్యక్రమం నిర్వహిన్నారని ఎస్ ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్టు అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు తెలిపారు. నగరంలోని చౌదరి సత్యన్నారాయణ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు తిథి భోజనాలను సోమవారం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూరశ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ జాతీయ నూతన విద్యావిధానం ప్రవేశపెట్టిన తరువాత పరివర్తనాత్మక సంస్కరణలపై, విద్యాభివృద్ధి చేయడంలో నిబద్ధత వెలికితీయడమే శిక్షా సప్తాహ్ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.
శిక్షా సప్తాహ్ కార్యక్రమం ద్వారా పాఠశాలలను సమాజంలో భాగస్వామ్యం చేయడం, చిన్నారులు పుస్తకాలను బట్టీ పట్టకుండా పరిసరాలను చూసి నేర్చుకోవడం జరుగుతుందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భోజనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం గోవిందరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
0 Comments