- ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా నిర్వహన
- అభ్యర్థులను ప్రోత్సాహించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం: గ్రూప్ - 2 మెయిన్స్ పరీక్షకు ఎంపికైన అభ్యర్థులు మరింత సాధనతో తమ ప్రయత్నంలో విజయవంతం కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రోత్సహించారు. జిల్లాకు చెందిన గ్రూప్ - 2 అభ్యర్థులకు శ్రీకాకుళం విద్యాధరి కళాశాల, టెక్కలి విశ్వజ్యోతి డిగ్రీ కళాశాల, పలాస మదర్ థెరిస్సా స్కూల్ లో మమాక్ టెస్ట్ ఆదివారం నిర్వహించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ - 1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్ - 2 పరీక్ష చేపట్టగా.. జిల్లా నలుమూలలకు చెందిన 300 మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఎర్రన్న విద్యాసంకల్పంలో భాగంగా గత ఏడాది గ్రూప్స్, డీఎస్సీ, పోలీస్ కానిస్టేబుల్స్ విభాగాల వారీగా ప్రతిభ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా గ్రూప్ - 2 మెయిన్స్ మాక్ పరీక్ష నిర్వహించామని కేంద్ర మంత్రి కార్యాలయం వెళ్లడించింది.
ఫొటో: మాక్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు
0 Comments