శ్రీకాకుళం,ఆగస్టు,16: 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ గా ఉండాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలసి ఆయన జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా 2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అధికారులు పని చేయాలని ఆదేశించారు. నీతిఆయోగ్ సహాయ సహకారాలుతో నిర్థేశిత లక్ష్యాలను నిర్ణయించుకొని అన్ని ప్రాధమిక రంగాల్లో అభివృద్ధికి 100 రోజులు, సంవత్సర ప్రణాళికలను తయారు చేయడమైనదని తెలిపారు. అదే విధంగా 2047 నాటికి లక్ష్యాలను ఏర్పరచుకొని అధిక వృద్ధి రేటును లక్ష్యంగా ఏర్పరచుకొని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రణాళికలు తయారుచేబడునని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో మౌలిక వసతులు నిర్మాణం జరుగునని తెలిపారు. పేదరిక నిర్మూలన చేస్తూ సంపన్న పేద వర్గాల మధ్య అంతరాన్ని తగ్గించడం జరుగుతుందని వివరించారు. ప్రాధమిక అవసరాలైన తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, విద్య, ఆస్తుల నిర్వహణలో అందరికి సముచిత న్యాయం జరగాలన్నదే లక్ష్యంగా పనిచేయాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ, గిడ్డంగుల నిర్వహణ, పునరుద్పాదక ఇందన వనరులు, వాణిజ్య పరంగా పర్యాటకాభివృధ్ది, వంటి నేపధ్య రంగాల్లో మండలాల భౌగోళిక, ఆర్ధిక పరిస్థితులకు అనుగుణంగా లక్ష్యాలను మండలాల వారీగా అధికారులు ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు, సిపిఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments