శ్రీకాకుళం, ఆగష్టు 16:- దివ్యాంగులు ఎందులోనూ తీసి పోరని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో గల గ్రీవెన్స్ హాలు నందు విభిన్న ప్రతిభా వంతుల వినతుల స్వీకరణ "స్వాభిమాన్" కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ మహమ్మద్ ఖాన్ తోకలసి ప్రారంభించారు.
కార్యక్రమంలో వివిధ పనులపై కలెక్టరేట్ కు వస్తున్న దివ్యాంగుల కోసం ర్యాంపు జిల్లా కలెక్టర్ రత్నాల శ్రీనివాసరావు, మల్లారెడ్డి భాస్కర్ రావు దివ్యాంగుల సంఘ సభ్యులతో రిబ్బన్ కట్ చేయించి ర్యాంప్ ప్రారంభించారు.
కార్యక్రమం వద్ద శ్రీకాకుళం మండలానికి చెందిన మట్టనీలం యాదవ్ దివ్యాంగుల జిల్లా అధ్యక్షులుతో జిల్లా కలెక్టర్ మాట్లాడగా జిల్లాకి అంధుల పాఠశాల, దివ్యాంగులకు జిల్లా ప్రధాన కేంద్రంలో హోమ్ కావాలని కోరగా అందుకు చర్యలు చేపడతామన్నారు.
మందస మండలం, సొండి పూడి గ్రామానికి చెందిన వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి భాస్కరరావు, మాట్లాడితూ మాకు ఒక ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని, అలాగే కలెక్టర్ కార్యాలయానికి వివిధ పనులపై రావడం జరుగుతుందని అయితే పైకి రావడానికి లిఫ్ట్ ఉన్న లిఫ్ట్ వరకు చేరడానికి ర్యాప్ లేదని కోరిన వెంటనే ర్యాంపు కట్టించి మాచెతే ప్రారభించిన జిల్లా కలెక్టర్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన రత్నాల శ్రీనివాసరావు దివ్యాంగుల అధ్యక్షులు మాట్లాడుతూ నిజమైన వికలాంగులకు న్యాయం చేయాలని కోరారు.
అనంతరం 10 గంటల నుండి 12 గంటల వరకు జిల్లాలో వివిధ మండలాల నుంచి వచ్చిన దివ్యాంగుల నుండి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా పరిషత్ సిఈఓ, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడి తో కలసి వినతులు స్వీకరించారు. స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమానికి 46 వినతులు వచ్చాయి. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్ మెంట్ ఇవ్వాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ప్రతీ నెల మూడవ శుక్రవారం దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ (స్వాభిమాన్) కేంద్ర పౌర విమానయాన శాఖామాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు వారి సలహా మేరకు నిర్వహించడం జరుగుతుందన్నారు.
దివ్యాంగులు ఎందులోనూ తీసి పోరని చెప్పారు. వారు ఆర్టీసీ బస్సుల్లో సులువుగా ప్రయాణించేందుకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో డిఆర్ఓ అప్పారావు, డిపిఓ వెంకట్వశ్వర్ రావు, డిఆర్డిఎ ప్రాజెక్ట్ అధికారి కిరణ్ కుమార్, ఆర్.అండ్.బి ఎస్ ఇ జాన్ సుధాకర్, ఎఐఈఈ రాజు, రిమ్స్ సుపరెంటెండెంట్ డా. షకీలా,, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి మీనాక్షి, సిపిఓ ప్రసన్న లక్ష్మి, జిల్లా నలుమూలల నుంచి పలువురు దివ్యాంగులు, బధిరులు, బ్లైండ్ సంఘాల సభ్యులు తదితరులు హాజరయ్యారు.
0 Comments