ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

APSRTC లో హెవీ డ్రైవింగ్ లో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

శ్రీకాకుళం :ఏపీఎస్ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్ నందు 17వ బ్యాచ్ హెవీ డ్రైవింగ్ శిక్షణ కు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సెప్టెంబర్ లో ప్రారంభమయ్యే 17వ బ్యాచ్ లో 16 మందికే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఉత్సాహవంతులు ఈ చక్కని ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు ఈ నెంబరు కు కాకుండా 9963091999 క్రింది నెంబర్లను సంప్రదించాలని కోరారు.7382923293,7095040608,7382924758.

Post a Comment

0 Comments