శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వ అధికారంలోకి రాకముందు 117 జీవోని రద్దు చేస్తామని హామీ ఇచ్చింది ఆ హామీ ప్రాప్తికి 117 జీవోను రద్దుచేసి జీవో నెంబర్ 53 ప్రకారం వర్క్ అడజస్ట్ మెంట్ చేయాలని యుటిఎఫ్ శ్రీకాకుళం జిల్లా శాఖ డీఈఓ గారిని కోరింది. హై స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉంటే ప్రమోషన్ ద్వారా ఫిల్ చేయాలి గాని మెదడాలజీ పేరుతో ఎస్జిటీలను పంపించడం గందరగోళంగా ఉంది. డివిజన్ స్థాయికి ఎస్జిటిల్లు పంపించేoదుకు వాళ్ళని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అటువంటి దానిని విరమించుకోవాలని యూటీఎఫ్ డిమాండ్ చేస్తుంది. ఈరోజు సాయంత్రం జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ తిరుమల చైతన్య గారికి సమస్యలపై వినతి పత్రం అందిస్తూ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అవార్డులు పారదర్శకంగా ఇవ్వాలని జిల్లా స్థాయి అవార్డులకి రెండు రోజులు టైం పెంచాలని సర్వీస్ రెగ్యులైజేషన్లు వెంటనే చేయాలని పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేయడమైనది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లండ బాబురావు ప్రధాన కార్యదర్శి శ్రీరామమూర్తి తో పాటు కోశాధికారి రవికుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్ర జిల్లా కార్యదర్శులు ఎస్ స్వర్ణకుమారి ,జి సురేష్, రాష్ట్ర కౌన్సిలర్ పొందూరు అప్పారావు, రెడ్డి త్రినాధరావు, పురుషోత్తం, దనుంజయ రావు తదితరులు పాల్గొన్నారు
0 Comments