నరసన్నపేట మండలం సత్యవరం గ్రామానికి చెందిన డప్పాటి కృష్ణవేణి కూరగాయలు తీసుకొని వస్తానని నరసన్నపేట వెళ్లి అదృశ్యమైందని తండ్రి చిట్టిబాబు నరసన్నపేట పోలీస్ స్టేషన్ లో శనివారం పిర్యాదు చేశారు. ఫిర్యాదు వివరాలు పరిశీలిస్తే ఈనెల 19వ తేదీన ఉదయం 11 గంటలకు తన కుమార్తె కృష్ణవేణి కూరగాయలు తెస్తానని వెళ్లిందని తెలిపారు. అయితే ఆరోజు నుండి ఈరోజు వరకు ఆచూకీ లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఈ అమ్మాయి ఎవరికైనా ఎక్కడైనా కనిపిస్తే నర్సంపట పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని కోరారు.
0 Comments