నరసన్నపేట: ఇంటర్మీడియట్ చదివే అభ్యర్థులకు(విద్యార్థులకు) నైపుణ్యాలను పెంపొందించేందుకు NDA ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శనివారం నరసన్నపేట పట్టణంలోని జ్ఞాన జ్యోతి డిగ్రీ కళాశాల ఆవరణలో ఇంటర్ బోర్డ్ మరియు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ సంయుక్తంగా హెచ్ సి ఎల్ టెక్ బి ఆధ్వర్యంలో జాబ్ మేళ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటర్మీడియట్ అర్హతతో ఉపాధి అవకాశాలతో పాటు, ఉన్నత చదువులు చదువుకునేందుకు ప్రభుత్వం అవకాశాలను కల్పిస్తుందన్నారు.మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ ఆలోచనతో రాష్ట్రంలో యువత కు నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక హబ్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం MLC వరుదు కళ్యాణి, విశ్రాంత ఆర్ఐఓ ఎస్ రుక్మంగదరావు,ఉప సర్పంచ్ కృష్ణబాబు,చిట్టిబాబు,రామారావు,వెంకటేశ్వరరావు,ప్రిన్సిపాల్ కృష్ణారావు, అంబేద్కర్ యూనివర్సిటీ ప్రతినిధి వంశీ తదితరులు పాల్గొన్నారు.
0 Comments