ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

జాబ్ కార్డు మంజురులో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు:కలెక్టర్

శ్రీకాకుళం, అక్టోబర్ 19: జాబ్ కార్డు మంజురుపై ప్రత్యేక దృష్టి సారించాలని, అర్హత ఉన్న వారికి జాబ్ కార్డు మంజురు కాలేదని ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.

శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ప్రకారం 18 సంవత్సరాలు నిండినవారు రూరల్, అర్బన్ లో ఎంతమంది ఉన్నారు, అలాగే ఛానల్ పనుల నిర్వహణపై ఆరా తీశారు. మండలాల వారీగా మంజూరు చేసిన జాబ్ కార్డులు, నిర్దేశిత లక్ష్యాలు సాధించిన ప్రగతిపై ఆరా తీశారు. గ్రామ సభలు నిర్వహించి జాబ్ కార్డులపై రివ్యూ నిర్వహించాలన్నారు. జాబ్ కార్డులు మంజురులో ఫిర్యాదులు వస్తే సంబంధిత ఏపీఓ పై క్రమశిక్షణా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.

కొండలపై పడిన వర్షపు నీరు నిలువ చేయడానికి చేపట్టిన పనులపై ఆరా తీశారు. మెలియాపుట్టి, కంచిలి, ఎల్ ఎన్ పేట, ఇచ్చాపురం, పొందూరు, వజ్రపుకొత్తూరు ఎపిఓలు చేపట్టిన పనులును కలెక్టర్ కు వివరించారు. వంశధార, బహుదా నదులకు సంబందించిన పెద్ద కాలువపనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టవలసిన లేబర్ పేమెంట్ పనులపై ఆరాతీశారు. వంశధార, బహుదా, నాగావళి ఓపెన్ హెడ్ ఛానల్స్ కి నీరు వెళ్లేందుకు వెజ్ రిలేటెడ్ వర్క్స్ కి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. కేనాల్ బడ్లపై, పాఠశాల ఆవరణలో,ప్రభుత్వం కార్యాలయాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. రెండు వందల రోజులలో నిర్దేశిత లక్ష్యాలు సాధించిన ప్రగతిపై ఆరాతీసి పనుల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేశారా లేదా అని అధికారులను కలెక్టర్ అడిగారు. పల్లె పండగ నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులు సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో వేగవంతం చేయడంతో పాటు పనిదినాలు జనరేట్ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పనులు విజయవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.పనులు అడిగిన 15రోజులలో పని ఇవ్వకుండా ఉన్న వారి వివరాలను డ్వామా ప్రాజెక్ట్ అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయాలని ఆదేశించారు.

ముందుగా డ్వామా ప్రాజెక్ట్ అధికారి సుధాకర్ జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులు వివరించారు. ఈ సమావేశంలో ఎపీడీలు, ఎపిఓలు, ఇసిలతో సహా పలువురు అధికారులు, డ్వామా సిబ్బంది హాజరైయ్యారు.

Post a Comment

0 Comments