ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

మహిళలపై వరుస హత్యలు.. అత్యాచారాలు..!! ధర్మాన

నరసన్నపేట, అక్టోబర్ 22 : కూటమి ప్రభుత్వము రాష్ట్రంలో ఆటవిక పరిపాలనను కొనసాగిస్తోందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 120 రోజులలో దాదాపు 74 మంది యువతులు, బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయని, ఇంత ఘోరమైన పాలన చేస్తున్న వీరు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రతీకార చర్యలకు వినియోగిస్తున్నారని దుయ్యబట్టారు. పలసలో ఇద్దరు బాలికలపై జరిగిన లైంగిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధిత కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని అన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

 రెడ్ బుక్ రాజ్యంగం పరిపాలనలో సూపర్ సిక్స్ అమలు ప్రశ్నార్థకం అయ్యిందని చెప్పారు. తమ హయాంలో రాష్ట్రంలోని సంక్షేమ ఫలాలు అందుకునే లబ్ధిదారులు ఈరోజు ఈ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, తమ వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే, అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యా వసతి దీవనలు, చేయూత, ఆసరా, వంటి సంక్షేమ నిధులు లబ్ధిదారుల ఖాతాలకు జమ కాలేదని గుర్తు చేశారు. ఇదే జగనన్న పాలన కొనసాగి ఉంటే, క్యాలెండర్ ప్రకారం సంక్షేమ ఫలాలు వారి వారి వ్యక్తిగత ఖాతాలోకి జమయ్యేవని తెలిపారు. ప్రజల దృష్టిని పాలన నుంచి మరలించేందుకు, డైవర్షన్ పాలిటిక్స్ ను రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో కృష్ణదాస్ ధ్వజమెత్తారు.

Post a Comment

0 Comments