ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

సైబర్ నేరాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. డీఐజీ గోపీనాథ్ జట్టి

శ్రీకాకుళం, అక్టోబరు 23. సైబర్ నేరాలు పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్లు బారిన పడకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి మంగళవారం జిల్లా విచ్చేసిన సందర్భంగా శ్రీకాకుళం పట్టణం కేంద్రంగా ఓ పత్రిక ప్రకటన జారీ చేశారు.

ఈ సందర్భంగా రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన జిల్లా ప్రజలకు కొన్ని సూచనలు జాగ్రత్తలు జారీ చేశారు.
*సైబర్ మోసగాళ్లు ఉపయోగించే 10 సాధారణ ఎత్తులు:* జాగ్రత్తగా ఉండి సురక్షితంగా ఉండండి అని మోసగాళ్లు అన్ని వయస్సుల వారిని లక్ష్యం చేస్తారు,అయితే మధ్య వయసు వారు మరియు వృద్ధులు ప్రత్యేకంగా సులభంగా బలి అవుతున్నారు. 

*ఈ సాధారణ ఎత్తులను తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి*:

*1.TRAI ఫోన్ మోసం*: మోసగాళ్లు TRAI లో పనిచేస్తున్నామని,మీ మొబైల్ నెంబర్ అక్రమ కార్యకలాపాలకు సంబంధించినదని, సేవలు నిలిపివేస్తామని చెప్పుతారు.
వాస్తవంగా TRAI సేవలను నిలిపి వేయదు,టెలికాం కంపెనీలు నిలిపివేయడం చేస్తాయిని గమనించాలన్నారు. 

*2. కస్టమ్స్ లో ప్యార్సల్ నిలిచిపోయిందంటూ*: సైబర్ మోసగాళ్లు ఒక ప్యార్సల్ అక్రమ పదార్థాలు, వస్తువులతో ఆర్డర్ పెట్టుబడిందని, చెల్లింపు చేయాలని డిమాండ్ చేస్తారు. అలాంటి ఫోన్ కాల్స్ రెస్పాండ్ కాకుండా ఆయా నెంబర్ల పై రిపోర్ట్ చేయలన్నారు.

*3. డిజిటల్ ఆరెస్ట్*: తప్పుడు పోలీస్ అధికారులు డిజిటల్ అరెస్ట్ లేదా ఆన్లైన్ విచారణ పేరుతో బెదిరిస్తారు. వాస్తవానికి పోలీసులు డిజిటల్ అరెస్టులు లేదా అన్లైన్ విచారణలు నిర్వహించరు అనే విషయాన్ని గుర్తించాలన్నారు.

*4.బంధువుల అరెస్టు అవుతాడని*: మీ బంధువును అరెస్టు చేస్తారని చెప్పి డబ్బు చెల్లించమని డిమాండ్ చేస్తారు.చర్య తీసుకునే ముందు మీ బంధువులతో మాట్లాడి ధ్రువీకరించుకోవాలని సూచించారు.

*5.త్వరగా సంపద సాధించే ట్రేడింగ్*: సోషల్ మీడియాలో పెట్టుబడులపై ఎక్కువ లాభాలు వస్తాయని ప్రకటనలు ఉంటాయి. వాస్తవానికి అధిక లాభాల పథకాలు సాధారణంగా జరేగే మోసాలు.

*6.సులభమైన పనులకు భారీ బహుమతులు:* మోసగాళ్లు సులభమైన పనులకు పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని చెప్పి,ఆపై పెట్టుబడిని అడుగుతారు.
వాస్తవానికి సులభంగా డబ్బు సంపాదించేవి కూడ మోసాలు అని గుర్తించాలి.

*7.మీ పేరుతో క్రెడిట్ కార్డు జారీ చేయబడిందని*: తప్పుడు అధికారి పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగిన క్రెడిట్ కార్డు గురించి ధృవీకరిస్తారు.మీ బ్యాంకులో తనిఖీ చేసుకోవాలి.

*8.పొరపాటున డబ్బు బదిలీ జరిగింది*: వారు పొరపాటున డబ్బు అకౌంట్లో బదిలీ జరిగిందని చెప్పి మీ వద్ద నుండి డబ్బు తీసుకోవాలని ప్రయత్నిస్తారు.
అలాంటి సమయంలో మీ బ్యాంకు లో లావాదేవీలను ధృవీకరించుకోవలి.

*9.KYC గడువు ముగిసింది: మోసగాళ్లు KYC నవీకరణల కోసం లింకులు పంపుతారు*.వాస్తవంగా బ్యాంకులు వ్యక్తిగతంగా KYC నవీకరణను కోరుతాయి.

*10. ఉగాది పన్ను రీఫండ్:*
మోసగాళ్లు పన్ను అధికారులు అని నటిస్తూ మీ బ్యాంక్ వివరాలను అడుగుతారు. పన్ను శాఖ వద్ద ఇప్పటికే మీ బ్యాంక్ వివరాలు ఉంటాయి మరియు వారు నేరుగా మీకు సంప్రదిస్తారు ఆ విషయాన్ని గుర్తించాలన్నారు.

*సురక్షితంగా ఉండండి*:

1.చర్య తీసుకునే ముందు ప్రతీ సమాచారాన్ని ధ్రువీకరించుకోవాలి.
2.అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దు.
3.లావాదేవీలను బ్యాంకు లతో ధృవీకరించుకోండి.
4.అనుమానాస్పద కాల్స్/ నంబర్లను రిపోర్ట్ చేయండి.
5.అధిక లాభాల పథకాల పట్ల జాగ్రత్త వహించండి.
6.KYC నవీకరణను వ్యక్తిగతంగా చేయండి.
7.మీ వ్యక్తిగత/ బ్యాంక్ వివరాలను పంచుకోవద్దు.

*మోసాలఫై రిపోర్ట్ చేయండి*:సైబర్ మోసం నివేదికకు డయల్ చేయండి - సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 సంప్రదించాలి.సైబర్ క్రైమ్ జరిగిన కొద్దీ గంటల్లో సైబర్ క్రైం నెంబర్ 1930 కి రిపోర్ట్ చేస్తే తప్పక న్యాయం జరుగుతుందని అన్నారు.నేషనల్ కస్టమర్ హెల్ప్ లైన్ (1800-11-4000)
సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (cybercrime.gov.in) లో నమోదు చేయాలి.మీ స్థానిక పోలీస్ స్టేషన్ పోలీసు అధికారులకు తక్షణమే సంప్రదించి సైబర్ మాసం వివరాలు తెలపాలి.

పై జాగ్రత్తలన్నీ తూచా తప్పకుండా పాటించడం,
తెలుసుకోవడం,అప్రమత్తంగా ఉండడం మీ రక్షణ! అని విశాఖపట్నం రేంజ్ శ్రీ గోపీనాథ్ జట్టి తెలిపారు.

Post a Comment

0 Comments