గార మండలం వనితమండల - పోలాకి కనెక్టివిటీ హై లెవల్ క్రాసింగ్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి పోలీసు, ఎంపిడిఓ, తదితరమైన కార్యాలయాలు మార్చాలన్నారు. భూ సేకరణకు సంబంధించి పేమెంట్ చేయాల్సి ఉందన్నారు. బ్రిడ్జికి సంబంధించి ఫైల్ గూర్చి ఆర్ అండ్ బి ఈఎన్సీ తో వెంటనే మాట్లాడారు. కళింగపట్నం - శ్రీకాకుళం - పార్వతీపురం రోడ్ పైన సమీక్షించారు. రహదారి పనులను సత్వరమే పూర్తి చేయాలని, రహదారికి ఇరువైపులా బ్యూటిఫికేషన్ పనులు గూర్చి ఆయన అడిగి తెలుసుకున్నారు. విజయాదిత్య పార్క్ పనులకు సంబంధించి పార్కింగ్, మరుగుదొడ్ల, సైకిల్ ట్రాకింగ్, ఫుట్ పాత్, గ్రీనరీల గూర్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్లను ఆయన అడిగి తెలుసుకొని సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెద్దపాడు చెరువు డిపిఆర్ పైన చర్చించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కె. సాయి ప్రత్యూష, ఆర్ అండ్ బి ఎస్ఈ జాన్ సుధాకర్, ఈఈ, డిఈలు, మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments