ఈ సందర్భంగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె మాట్లాడుతూ ప్రాధమిక స్థాయిలో క్యాన్సర్ ను గుర్తిస్తే చికిత్స చేయటం ఎంతో సులభతరం అవుతుంది అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్యాన్సర్ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ప్రధానమంత్రి ఆయూష్మాన్ భారత్ పథకం లో కూడా క్యాన్సర్ ను చేర్చి ఉచితంగా చికిత్స అందిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. శరీరంలో ఎక్కడైనా వాపు లేదా గెడ్డలు వస్తె సత్వరమే చికిత్స చేసుకోవాలని సూచించారు. ప్రజల్లో బెస్ట్ క్యాన్సర్ పై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్ణయం మేరకు శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సకిలా సారధ్యంలో సదస్సు ర్యాలీ చేపట్టామన్నారు. క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. మహిళలు క్యాన్సర్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు వక్తలు వివరించారు.. ఈ కార్యక్రమంలో రిమ్స్ ఆస్పత్రి వైద్యులు,నర్సింగ్ విద్యార్థులు, శ్రీకాకుళం నగరంలో ఉన్న మహిళా డాక్టర్స్ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
0 Comments