ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

విద్యార్థులు మాదకద్రవ్యాల జోలికి వెళ్లొద్దు: ఎస్సై

విద్యార్థులు మాదకద్రవ్యాల జోలికి వెళ్లొద్దు.

- ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ హరికృష్ణ.
- విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం లో పోలీస్ స్టేషన్లపై అవగాహన.
శ్రీకాకుళం- 22 :విద్యార్థులు మాదక ద్రవ్యాల బారినపడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని ఒకటో పట్టణ ఎస్సై హరికృష్ణ విద్యార్థులకు సూచించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం చైతన్య కళాశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్లలో పోలీసుల విధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సైలు హరికృష్ణ, కృష్ణారావులు మాట్లాడుతూ పోలీసులు ఉపయోగిస్తున్న టెక్నాలజీ గురించి, రిసెప్షన్, లాకప్ రూమ్ స్టేషన్ రైటర్, జీరో ఎఫ్ ఆర్, రికార్డుల నిర్వహణ, టెలికాన్ఫరెన్స్, ఆన్ లైన్ ఎఫ్ఐఆర్, పార్టు మ్యాప్, పిస్టల్, ఇతర ఆయుధాల గురించి వివరించారు. సీసీ కెమెరాల వల్ల కలిగే ఉపయోగాలు గురించి మైనర్ డ్రైవింగ్ చేయవద్దని మోటార్ వాహనాల చట్టాలు వివిధ రకాల బందోబస్తు గురించి, పోగొట్టుకున్న ఫోన్ సిఇఐఆర్ అప్లికేషన్ ద్వారా దొరికే విధానం వివిధ రకాల గురించి విద్యార్థులకు వివరించారు. పోలీస్ డాగ్ రాణిని తెచ్చి గంజాయిని కలిగి ఉంటే ఏ విధంగా ఈ ట్రైనీ డాగ్ పసిగడుతుందో విద్యార్థులకు చేయించి చూపించారు. విద్యార్థులు యూనిఫాం లేని రక్షకభట్లుగా పని చేయాలని మీ పరిసరాల్లో జరిగే అసాంగా కార్యక్రమాల గురించి పోలీసులకు సమాచారం అందజేయాలని కోరారు. మీ వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని, మీకు రక్షణ కూడా కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చైతన్య జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ రౌతు శ్రీనివాసరావు, జూనియర్ లెక్చరర్లు చినరాజు, నీలిమతో పాటు ఏఎస్ఐ రాంబాబు, రైటర్ బొమ్మాలి రవికుమార్, అప్పలనాయుడు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments