ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఉత్తమ అవార్డు గ్రహీతలకు ఘన సత్కారం చేసిన సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు

నరసన్నపేట: సిటిజెన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బెస్ట్ టీచర్ అవార్డ్ పొందిన సూర్యనారాయణ,అనిత లకు నరసన్నపేటలో ఆదివారం ఘనంగా సన్మానించామని గౌరవాధ్యక్షులు విశ్వేశ్వరరావు తెలిపారు. వీరితోపాటు అబ్దుల్ కలాం అవార్డు పొందిన దుర్గాప్రసాద్, ఉత్తమ సేవా అవార్డు పొందిన శాంతారావు లను ఘనంగా సన్మానం చేశామన్నారు. నరసన్నపేటకు చెందిన వీరందరికీ అవార్డులు రావడం ఆనందదాయకమని, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా సొసైటీ సభ్యులు జామి లక్ష్మణరావు ద్వారా పెద్దపేట జంక్షన్ వద్ద ఒక స్టాపర్ బోర్డు పెట్టుటకు త్వరలో నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సువ్వారి మురళీధరరావు,కార్యదర్శి మార్పు విజయ కుమార్, కోశాధికారి ఉప్పాడ పూర్ణరావుస్వామి, పాల్గొన్నారు.

Post a Comment

0 Comments