ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

సీఐ గా బాధితులు స్వీకరించిన ఈశ్వరరావు

శ్రీకాకుళం: విది నిర్వహణలో సమన్వయం పాటించాలని, ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీసుగా వ్యవహరించాలని తద్వారా క్రైమ్ రేట్ ని తగ్గించే ప్రయత్నం చేయాలని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ నూతన సీఐ పి ఈశ్వరరావు తెలిపారు. ఆదివారం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఎన్నో రకాల క్రైములు జరుగుతూ ఉంటాయని, ముఖ్యంగా యువత మాదకద్రవ్యాల వైపుగాని అసాంఘిక కార్యక్రమాల వైపుగాని వెళ్ళకుండా అవగాహన కార్యక్రమాలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఫిర్యాదుదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో విశాఖపట్నంలో పలు పోలీస్ విభాగాల్లో సిఐగా పనిచేసి, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ రూరల్ పోలీస్ స్టేషన్ సిఐగా విధులు నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన సిఐ ఈశ్వరరావుకు ఎస్ఐలు సిబ్బంది అభినందించారు. అనంతరం స్టేషన్లోని సిబ్బందితో పరిచయ కార్యక్రమం. సిఐ నిర్వహించారు.

Post a Comment

0 Comments