శ్రీకాకుళం,డిశంబరు,20: ఉపాధి హామీ పనులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గుత్తేదారులకు చెప్పారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్ ఇంజనీర్లు, గుత్తేదారులతో ఆయన ఉపాధి హామీ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉపాధి హామీ పై మంజూరు చేసిన పనులలో అవసత్వం లేకుండా సత్వరమే పూర్తి చేయాలన్నారు. చేసిన పనులకు బిల్లులు అప్ లోడ్ చేయాలని చెప్పారు. బి.టి., సి.సి. రోడ్లు, తదితర పనులు వర్షాలు తగ్గిన వెంటనే పనులు చేసి పూర్తి చేయాలన్నారు. ప్రతీ వారానికి పనుల పురోగతిలో తేడా ఉండాలని తెలిపారు. పనులు పురోగతి పై వారం వారం సమీక్షిస్తానన్నారు. పనులు పూర్తి చేసేస్తే మరిన్ని పనులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. సమస్యలు ఉంటే చెప్పాలన్నారు. ఈ సమావేశంలో ఈఈలు ఎస్. రామకృష్ణ, సూర్య ప్రకాష్, డిఈలు, ఎఈలు, గుత్తేదారులు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments