ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

జిల్లాలో 75 కేంద్రాల్లో పరీక్షలు.పరీక్షలకు 40,346 మంది హాజరు.ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు

శ్రీకాకుళం, ఫిబ్రవరి 11: ఇంటర్మీడియట్ బోర్డు పబ్లిక్ పరీక్షలు శ్రీకాకుళం జిల్లాలో 75 కేంద్రాల్లో జరుగుతాయని జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ అధికారి ప్రగడ దుర్గారావు చెప్పారు. ఈ పరీక్షలకు 40,346 మంది హాజరు అవుతారని పరీక్షలు జంబ్లింగ్ పద్దతిలో జరుగుతాయని, సి సి కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా పరీక్షలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.. ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల పదవ తేదీ నుండి ప్రారంభం అయ్యాయని అన్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు 113 కేంద్రాలు కేటాయించగా తొలివిడతగా 61 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వినూత్న రీతిలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు లేకుండా చేయాలని ఆలోచన చేసి ఆచరణలో ప్రజాభిప్రాయం తీసికొని మళ్లీ ప్రభుత్వ ప్రతిపాదన విరమించారని చెప్పారు. పాత పద్దతుల్లో పరీక్షలు జరుగుతాయని ఇందులో ఎటువంటి అనుమానం లేదన్నారు. విద్యార్థులకు పరీక్షలు సమయంలో ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారని. ప్రతీ పరీక్ష కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని చెప్పారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పండ్కర్ పర్యవేక్షణలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరపటానికి అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం జరిగిందని దుర్గారావు స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments