..................................................
ఈ గంజాయి "మత్తులో పడే నరసన్నపేటలో హత్యలు, దొంగతనాలు"
.............................................
భయభ్రాంతులకు గురవుతున్న నరసన్నపేట పట్టణ ప్రజలు
...............................................
నరసన్నపేటలో గంజాయి అక్రమ రవాణా అరికట్టాలని కూటమి ప్రభుత్వానికి* నరసన్నపేట నియోజకవర్గం యువ నాయకులు, పోలాకి జడ్పిటిసి "డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య" డిమాండ్
..............................................
(నరసన్నపేట) 06.03.2025
ఇటీవల కాలంలో నరసన్నపేట వంటి ప్రశాంతమైన పట్టణంలో... పోలీసులు రైడింగ్ చేస్తే..20 కేజీల గంజాయి పట్టుబడడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
అలాగే అరతులం బంగారం కోసం ఓ వృద్ధురాలిని గంజాయి బ్యాచ్ హత్య చేయడo ... దారుణమైన విషయం..అదీకూడ ముక్కు పచ్చలారని యువతే నిందితులు కావడం బాదేస్తుంది.
ఈ రోజు నరసన్నపేట పట్టణంలో వరుస దోంగతనాలు... అసలు నరసన్నపేటలో ఏం జరుగుతుంది... పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురిచేస్తున్న విషయం ఇది.
......................................................
మునిపెన్నడు లేనివిధంగా నరసన్నపేట పట్టణంలో విచ్చలవిడిగా గంజాయి రవాణా వ్యాపారం సాగుతోందని.... యువత గంజాయి మత్తు లో పడి చెడు మార్గాన పయనిస్తున్నారని.. కూటమి ప్రభుత్వంలో నరసన్నపేట గంజాయి మయంగా మారిపోయిందని... ఈ గంజాయి రవాణాను కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలని *నరసన్నపేట నియోజకవర్గం యువనాయకులు, పోలాకి జడ్పిటిసి డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య* ఓ ప్రకటనలో కోరారు. గురువారం ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. నరసన్నపేట పట్టణంలో గంజాయి రవాణా వ్యాపారంపై ప్రస్తావిస్తూ... ఇటీవల కాలంలో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన సంఘటనలను ఆయన గుర్తు చేశారు. అలాగే గంజాయి మత్తు బారినపడి కొందరు యువకులు ఓ వృద్ధురాలిని హత్యకు పాల్పడిన సంఘటన చూస్తే నరసన్నపేటలో ఏ రకమైన గంజాయి బ్యాచ్ అరాచకాలు జరుగుతున్నాయన్న విషయం ఇట్టే అర్థమవుతుందన్నారు. అలాగే ఇటీవల పోలీసులు శాఖ వారు దాడులు జరిపి భారీగా గంజాయి ని పట్టుబడిన సంఘటనలు చూస్తే భయం వేస్తుందన్నారు. ప్రశాంత వాహనానికి నిలయమైన నరసన్నపేట పట్టణంలో గంజాయి మూకల అరాచకాలు చూసి ఏ రోజుకు ఏం జరుగుతుందో అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ నరసన్నపేటలో గంజాయి రవాణా ఎక్కువైందని ఆయన ఆరోపించారు. . అలాగే ఉడుకు రక్తంతో ఉన్నటువంటి యువతనే టార్గెట్ చేస్తూ... ముగ్గులోకి దించి జరుగుతున్నటువంటి ఈ వ్యాపారంపై. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. యువత గంజాయి మత్తు బారిన పడి , చెడు మార్గాన పయనించకుండా మరిన్ని చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
0 Comments