శ్రీకాకుళం,మార్చి,6: పిల్లలపై లైంగికవేదింపులు జరుగకుండా వారిని జాగ్రత్తగా చూసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. టి.వి.బాలమురళి కృష్ణ తెలిపారు. గురువారం వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో పిల్లలపై లైంగిక వేదింపులు ఏ విధంగా నివారించాలి అనే అంశంపై ఒక్క రోజు అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలపై లైంగిక దాడులు జరగకుండా చూసుకోవడం మనందరి భాద్యతన్నారు. లైంగిక దాడులకు పాల్పడిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించడం జరుగుతుందని తెలిపారు. లైంగిక వేదింపులపై పిల్లలకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని, అపరిచితులతో జాగ్రత్తగా ఉండేటట్లు జాగ్రత్తలు తెలియజేయాలన్నారు. ఎన్.సి.డి. ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.వెంకటరావు మాట్లాడుతూ పిల్లలపై లైంగిక దాడులు జరగకుండా చూసుకోవడం తల్లి తండ్రుల భాధ్యతే కాకుండా మన అంధరి భాద్యత అని దీనిపై సమాజం అవగాహణతో వుండాలని తెలియజేశారు. పిల్లలకు గుడ్ టచ్-బేడ్ టచ్ లపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి ట్రైనర్ ఎస్. ఉదయ్ కుమార్, సైకాలజిస్ట్ రాజకుమార్ మాట్లాడుతూ ఈ రోజుల్లో పిల్లలు పలు లైంగిక వేదింపులకు గురి అవుతున్నారని, వీటి నుండి పిల్లలు ఏవిధంగా అప్రమత్తంగా వుండాలనే అంశాలపై వివరించారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు వుండేవని, నేడు స్వతంత్ర కుటుంబాలుగా జీవించుట వలన పిల్లల మానసిక ఎదుగుదలకు సరైన విషయాలు భోదించేవారు లేరన్నారు. పిల్లలకు ఏది మంచో ఏది చెడో ఉపాద్యాయులు కూడా తెలియజేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డియంహెచ్ఓ డాక్టర్ మేరీ కాథరరీన్, డి.పి.యం.ఓ. వాన సురేష్ కుమార్, వైద్యాధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, మహిళా భివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సి.డి.పి.ఓ. లు, ప్రభుత్వ మానసిక ఆసుపత్రి సిబ్బంది, సైకియాట్రిస్ట్ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్ వెన్షన్ పిడియాషెయన్, మెడికల్ ఆఫీసర్, డిఈఐసి మేనేజర్ మరియు వైద్య ఆరోగ్య శాఖా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
0 Comments