ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

హోంమంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం. ధర్మాన కృష్ణదాస్

శ్రీకాకుళం, ఏప్రిల్ 9 :‘‘లింగమయ్య హత్యను కుటుంబ తగాదా అంటూ చెప్పడం హోంమంత్రికి ఏమాత్రం తగదు. అది బాధిత కుటుంబాన్ని అవమానపరచడమే కాదు, పోలీసు దర్యాప్తుపై ప్రభావం చూపే ప్రయత్నం కూడా’’ అంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, Ex.Dy CM ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా స్పందించారు.

హోంమంత్రి వంగలపూడి అనిత శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం పర్యటించి, మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలపై ధర్మాన మండిపడ్డాడు. ‘‘లింగమయ్య హత్య ఒక రాజకీయ కుట్రలో భాగం. ప్రజల ముందు జరిగిన హత్యను కుటుంబ వివాదంగా చిత్రీకరించడం బాధాకరం. జగన్ బాధితులను పరామర్శించడాన్ని విమర్శించడం మానవత్వానికి విరుద్ధం’’ అని కృష్ణ దాస్ వ్యాఖ్యానించారు.

అధికారంలో ఉన్నవాళ్లు దిశా దృష్టి కోల్పోయారు

‘‘ఒక రాష్ట్ర హోంమంత్రి పోలీసు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కలిగించేలా మాట్లాడాలి. కానీ అనిత వ్యాఖ్యలు చూస్తే, ఆమె హోంమంత్రిగా కాదు, టీడీపీ నాయకురాలిగా మాట్లాడినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి,’’ అని విమర్శించారు.

వాస్తవాలు దాచే ప్రయత్నం

‘‘ఇది స్పష్టంగా రాజకీయ హత్య. ఇప్పుడదాన్ని దారి తప్పించే ప్రయత్నం జరుగుతోంది. అసలు విషయాలు బయటకు రాకుండా చేయాలన్నది అధికార పక్ష లక్ష్యంగా కనిపిస్తోంది. దర్యాప్తు పూర్తయ్యేలోపు అధికార ప్రతినిధులు ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదు. అదే మాన్యువల్ ప్రకారం కూడా,’’ అని ధర్మాన కృష్ణ దాస్ సూచించారు.

జగన్‌కి ప్రజల మద్దతు ఉన్నందుకే భయపడుతున్నారు

‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూ ప్రజల దృష్టి మళ్లించాలనే ప్రయత్నం జరుగుతోంది. జగన్ నాయకత్వాన్ని తక్కువచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ప్రజలు నిజాయితీని గుర్తిస్తారు. మిగతా వారు మాటలతో మాయచేస్తే, జగన్ పనితో నమ్మకం కలిగించారు’’ అని ధర్మాన వ్యాఖ్యానించారు.

Post a Comment

0 Comments