ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

శ్రీకాకుళం, ఆగస్టు 25:జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13న జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ జరగనుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జూనైద్ అహ్మద్ మౌలానా ప్రకటించారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, మోటారు వాహన ప్రమాదాలు, ప్రీ-లిటిగేషన్ కేసులు ఈ లోక్ అదాలత్‌లో పరిష్కరించబడనున్నాయన్నారు.
 
ప్రజలు, కక్షిదారులు, న్యాయవాదులు, ప్రభుత్వ అధికారులు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పోలీస్ అధికారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. లోక్ అదాలత్ ద్వారా ప్రజలు తక్కువ ఖర్చుతో, వేగంగా న్యాయం పొందగలరు. అందువల్ల కేసులు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని మౌలానా పిలుపునిచ్చారు.

Post a Comment

0 Comments