_ పెనాల్టీ లేకుండా వెహికల్ ఫిట్నెస్ ఇవ్వాలి
_ స్పందనలో జెసిని కోరిన ఎండియు ఆపరేటర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ
(శ్రీకాకుళం)
కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జూన్ నెల నుండి ఎండియు వ్యవస్థ రద్దు చేస్తూ మా వెహికల్ సంబంధించి క్లియరెన్స్ ఇస్తామని చెప్పిన విధంగా తక్షణమే వెహికల్ క్లియరెన్స్ ఇవ్వాలని ఎండియు ఆపరేటర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ కోరారు. ఈ మేరకు సోమవారం ప్రజాస్పందనలో జెసి ఫర్మన్ అహ్మద్ ఖాన్ కు వినతి పత్రం అందజేసారు. నిర్దేయగా రాష్ట్ర వ్యాప్తంగా 9260 కుటుంబాలను రోడ్డును పడేసి తీసుకున్న ఈ నిర్ణయం చాలా బాధాకరం అని తెలిపారు. అయినప్పటికీ ఇప్పటివరకు మా వెహికల్ క్లియరెన్స్ చేయడం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలానే రవాణా శాఖకు సంబంధించి మొబైల్ క్యాంటీన్ గా ఉన్న మా వాహనాలను గూడ్స్ క్యారియర్ గా మార్చి పెనాల్టీ మినహాయించి ఫిట్నెస్ చేయించుకునే విధంగా అవకాశం కల్పిస్తామని కమిషనర్ సర్కులర్ రిలీజ్ చేశారన్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి కార్యచరణ నిర్వహించడం జరగలేదని పేర్కొన్నారు. నాలుగు మాసాలుగా మా వెహికల్స్ ని ఏ పనికి ఉపయోగించుకోకుండా మాకు ఉపాధి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నామని జెసికి వివరించారు. ఉపాధి కోల్పోయిన ఎండియు ఆపరేటర్స్ నీ దృష్టిలో పెట్టుకుని తక్షణమే వెహికల్ క్లియరెన్స్ చేస్తూ ఎటువంటి పెనాల్టీ లేకుండా వెహికల్ ఫిట్నెస్ చేయించుకున్న విధంగా సర్కులర్ రిలీజ్ చేయాలని కోరారు. దీనిపై జెసి సానుకూలంగా స్పందిస్తూ సివిల్ సప్లై కమిషనర్ ఆఫీస్ కు వింత పత్రం పంపించడం జరుగుతుందన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సమస్య అయినందున వేగంగా మీ పనులు జరిగేలా చేస్తానని హామీలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో. సూర్యనారాయణ తో పాటు జిల్లా ఉపాధ్యక్షులు హేమంత్, ట్రెజరర్ పైడి వరాహ నరసింహులు పాల్గొన్నారు
0 Comments