ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

1వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. ఎస్ఎస్ఎ ఎపిసి — డా. ఎస్. శశిభూషణ్


శ్రీకాకుళం, ఆగష్టు 12: విద్యా హక్కు చట్టం–2009 ప్రకారం 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాలతో పాటు అనాథలు, హెచ్ఐవి బాధితులు, విభిన్న ప్రతిభావంతుల పిల్లలకు 25% కోటా కింద రాష్ట్రంలోని ప్రైవేటు, ఆన్-ఎయిడెడ్ పాఠశాలల్లో (IB / CBSE / ICSE / స్టేట్ సిలబస్) 1వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష అభియాన్ ఎపిసి డా. ఎస్. శశిభూషన్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల ఆధార్, ప్రాథమిక వివరాలతో https://cse.ap.gov.in లో రిజిస్టర్ చేయవచ్చనీ, లేదా గ్రామ సచివాలయం, మండల విద్యా వనరుల కేంద్రం, పాఠశాల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చనీ, సీట్లను లాటరీ ద్వారా కేటాయిస్తారనీ వివరించారు.  

పూర్తి వివరాలకు టోల్ ఫ్రీ నంబర్: 1800 425 8599, RTE జిల్లా నోడల్ అధికారి నంబర్ 9440484672 లో సంప్రదించవచ్చని సూచించారు.
దరఖాస్తు తో పాటు చిరునామా ధృవీకరణ పత్రం, జనన ధృవీకరణ పత్రo సమర్పించాలని తెలిపారు.

Post a Comment

0 Comments