ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

సిక్కోలు వజ్రోత్సవాలలో మేము సైతం.

సిక్కోలు వజ్రోత్సవాలలో మేము సైతం.

- దేశనాయకుల వేషధారణలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చిన్నారులు 
- జాయ్ కిడ్స్ ప్లేస్కూల్ యాజమాన్య వినూత్న ఆలోచన
- అభినందించిన జిల్లా కలెక్టర్ స్వప్పిల్ దినకర్ పుండ్కర్ ,జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ,సబ్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ లు 
- చిన్నారులతో ఎమ్మెల్యే గొండు శంకర్ ముచ్చట్లు 


 శ్రీకాకుళం టౌన్ న్యూస్: 

శ్రీకాకుళం జిల్లా ఏర్పాటై 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవాలలో మేము సైతం అంటూ నగరంలోని పిఎన్ కాలనీలో గల జాయ్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ చిన్నారులు పాల్గొన్నారు. వజ్రోత్సవాలలో భాగంగా తొలి రోజు నాగావళి హోటల్ వద్ద బుదవారం నిర్వహించిన కార్యక్రమం వద్దకు చిన్నారులు దేశ నాయకుల వేషధారణలలో చేరుకున్నారు. గాంధీ,నెహ్రు,సుభాష్ చంద్రబోస్ , తదితర దేశ నాయకులు,త్రివిధ దళాలు,సివిల్ సర్విసెస్ అధికారుల వేషధారణలలో వారు అలరించారు. దేశ నాయకుల వేషధారణలలో సిక్కోలు వజ్రోత్సవాలలో జాయ్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ చిన్నారులు అక్కడకు హాజరుకావడంతో జిల్లా కలెక్టర్ స్వప్పిల్ దినకర్ పుండ్కర్ ,జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ,సబ్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ లు కరస్పాండెంట్ జామి స్రవంతి కిరణ్ ను అభినందించారు. వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ చిన్నతనం నుంచే విద్యార్ధిని,విద్యార్ధులకి అన్ని విషయాలపై అవగాహన కల్పించేందుకు చేస్తున్న కృషిని వారు కొనియాడారు. విచిత్ర వేషధారణలతో విచ్చేసిన చిన్నారులతో అధికారులు ముచ్చటించారు. వారికి ఆశీస్సులను అందజేసారు. 

*చిన్నారులతో ఎమ్మెల్యే శంకర్ ముచ్చట్లు*

సిక్కోలు వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ జాయ్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ విద్యార్ధులు దేశనాయకుల వేషధారణలతో పాటు ప్రధాని నరేంద్రమోడీ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఆ చిన్నారులతో ఎమ్మెల్యే గొండు శంకర్ ముచ్చట్లాడారు. పిల్లలతో సరదాగా మాట్లాడారు. వజ్రోత్సవాలలో భాగస్వామ్యులైనందుకు జాయ్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ కరస్పాండెంట్ జామి స్రవంతి కిరణ్ ను అభినందించారు. చిన్నారులకి శభాష్ అంటూ భుజం తట్టి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయ్ కిడ్స్ ప్లే స్కూల్ ఉపాధ్యాయులు,సిబ్బంది ,చిన్నారులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments