ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

దివ్యాంగుల పెన్షన్ల తొలగింపుకి కూటమి కుట్ర.YSRCP జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ధ్వజం. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేత.

శ్రీకాకుళం, ఆగస్టు 25: రాష్ట్రంలోని దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదల పెన్షన్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా విమర్శించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం నాలుగు వేల మందికి పెన్షన్ దూరం చేశారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ హామీని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు వస్తున్న పెన్షన్లను కూడా నిలిపివేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

రీవేరిఫికేషన్, రీ–అసెస్‌మెంట్ పేరుతో దివ్యాంగులను మళ్లీ వైద్యుల వద్దకు పంపించి సర్టిఫికెట్లు తెప్పించడం, 40 శాతం కంటే తక్కువ వికలాంగ్యం ఉందని సాకులు చూపించి పెన్షన్లు తొలగించడం మానవత్వానికి విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లుగా పెన్షన్ పొందుతున్న వృద్ధులు, వికలాంగులు ఒక్క రోజులోనే అనర్హులుగా ముద్ర వేయబడటం దారుణమని వ్యాఖ్యానించారు.

“పెన్షన్లు అనేవి పేదల జీవితానికి శ్వాస వంటివి. వికలాంగులను ఆదుకోవాల్సింది పోయి, వారిని కక్ష్యపూర్వకంగా ఇబ్బంది పెట్టడం దారుణం. రాజకీయాలు వేరే, పింఛన్లు వేరే. సంక్షేమ పథకాలు నిజంగా అందించగలిగేది ఒక్క జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే” అని ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా చూడాలని, ప్రభుత్వం వెంటనే పెన్షన్ల తొలగింపు నిర్ణయాన్ని పునరాలోచించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ పిరియ విజయమ్మ , టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, జిల్లా వికలాంగుల విభాగం అధ్యక్షులు వెలమల బాలరాజు , జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు రౌతు శంకరరావు , కోటబొమ్మాళి జడ్పీటీసీ దుబ్బ వెంకటరమణ ,ఎంపీపీ రోణంకి ఉమ మల్లయ్య , మండల సంపతి రావు హేమ సుందర రాజు , వైస్ ఎంపీపీ దుక్క రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments