శ్రీకాకుళం, ఆగష్టు 12: ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగులను నులిమేద్దామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎన్ టి ఆర్ మునిసిపల్ హై స్కూల్ లో జరిగిన మాత్రలు పంపిణీని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు, కిశోర బాలల కడుపులో నులిపురుగులు ఉన్నట్లయితే పోషకాహార లోపం, రక్తహీనతతో నీరస పడతారని, శారీరక, మానసిక ఎదుగుదల లోపాలకు గురవుతారని తెలిపారు.
గత రెండు వారల నుంచి విద్యార్థులku, పిల్లల తల్లిదండ్రులకు, సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలల్లో ఉచితంగా ఇవ్వబడే అల్బెండజోల్ 400 మి.గ్రా. మాత్ర ద్వారా నులిపురుగుల సంక్రమణను సులభంగా నిర్మూలించవచ్చునని అన్నారు. జిల్లాకు ఆల్బెండజోల్ 400మి.గ్రా టాబ్లెట్స్ 5,03,800 వచ్చాయన్నారు. ఈ టాబ్లెట్స్ జిల్లాలో మండల పరిధిలో పి.హెచ్.సి.వైద్యాధికారి, ఎం.పి.డి.ఒ., ఎం. ఇ.ఒ., సి.డి.పి.ఒ. మరియు సి.ఆర్.పి. ల పర్యవేక్షణలో అన్ని పాఠశాలలకు మరియు అంగన్వాడి కేంద్రాలుకు 8వ తేది నాటికి ఈ మాత్రలు పంపిణి చేయడం జరిగిందన్నారు. ప్రతి పాఠశాలకు ఒక ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షకుడుగా నియమించడం జరిగినదన్నారు. ఈ మాత్రలు వేసుకొనడం వలన ఏవిధమైన ఔషద దుష్పరిణామాలు ఉండవని, ఒకవేళ ఔషధ దుష్పరిణామాలు కనిపించిన వెంటనే దగ్గరలో ఉన్న పి. హెచ్.సి వైద్యాధికారిని సంప్రదించవలెనన్నారు. జిల్లాలో ఎక్కడైనా కొంత మంది పిల్లలు కొన్ని కారణాలు వలన ఆల్బెండజోల్ 400మి.గ్రా టాబ్లెట్ తీసుకోకపోయనట్లయితే మళ్ళీ వారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జోనల్ మలేరియా ఆఫీసర్ డా బి. మీనాక్షి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. కె. అనిత, డిపిఓ ఇ. వెంకటరావు, మలేరియా మేనేజర్ అప్పలనాయుడు, మెడికల్ ఆఫీసర్స్, ఉపాధ్యాయులు, ఆషా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments