శ్రీకాకుళం, ఆగష్టు 12: ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయం ప్రతిపత్తి) విద్యార్థిని జే. గంగోత్రి (ఫైనల్ బీకాం వొకేషనల్) "ఆర్.టి.ఐ చట్టం – 2025" పై రాష్ట్రస్థాయి డిబేట్ పోటీలో ప్రథమ బహుమతి సాధించింది. ఆర్.టి.ఐ యాక్ట్ ప్రారంభించి 20 ఏళ్ల పూర్తయినసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ పోటీలో, కాలేజీ స్థాయి నుండి ఎన్ఆర్సీ, జోనల్ స్థాయిల్లో విజయం సాధించి, రాష్ట్రస్థాయిలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పి. శామ్యూల్ చేతుల మీదుగా బహుమతి స్వీకరించిన గంగోత్రిని మంగళవారం కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. సూర్యచంద్రరావు, కామర్స్ శాకాధిపతి లబ్బ కృష్ణారావు, అధ్యాపకులు లలిత, సంతోషి పట్నాయక్, ఎస్. మాధవీలత, వాణీ కుమారి మరియు సిబ్బంది అభినందించారు.
=======
0 Comments