ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఎరువు..!! కరువు..!! డా. ధర్మాన కృష్ణ చైతన్య

ఎరువు..!! కరువు..!!
.......................................‌....
👉 అన్నం పెట్టే అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు..!!
..............................................
👉 రైతుల ఉసురు కూటమి ప్రభుత్వానికి తప్పక తగులుతుంది..!!
..............................................
👉 కరువు.. చంద్రబాబు కవల పిల్లలు..!!
...............................................
👉 ఎరువుల సరఫరాలో కూటమి ప్రభుత్వ వైఫల్యం సుస్పష్టంగా కనబడుతుంది..!!
................................................
👉 రైతాంగం ఎరువులు కోసం *నానా అగచాట్లు పడుతున్నారు..!!
...............‌..................................
👉 ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలించడం కారణంగానే ఎరువులు కొరత..!!
................................................
👉 ఎరువులు కొరత కూటమి ప్రభుత్వానికి పట్టదా..!! రైతులంటే గిట్టదా..!!
.................................................
👉 రైతాంగం పడుతున్న ఇబ్బందులపై... ఎరువుల కొరతపై విరుచుకుపడ్డ యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య
...‌..............................................
నరసన్నపేట : ఆరుగాలం శ్రమటోడ్చి... కష్టపడి పొలంలో పనిచేయాల్సిన రైతన్నలు... రోడ్లెక్కి ఎరువులు కోసం ఎదురు చూపులు చూస్తూన్నారు. ఒక్క బస్తా అయినా దొరుకుతుందా అని ఎరువుల దుకాణాల ముందు పడిగాపులు కాస్తున్నారు. తొలి ఎరువు వేయలేక.. కాళ్లు అరిగేలా తిరుగుతున్న ఎరువు దొరక్క నేల చూపులు చూస్తున్నారు.. ఇది కూటమి ప్రభుత్వంలో అందరికీ అన్నం పెట్టే అన్నదాతల దౌర్భాగ్యమైన పరిస్థితి అని నరసన్నపేట నియోజకవర్గం యువ నాయకులు పోలాకి జడ్పిటిసి *డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య* కూటమి ప్రభుత్వం పాలనలో *ఎరువుల కొరత పై విరుచుకుపడ్డారు.* మంగళవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. నరసన్నపేట నియోజకవర్గంలో ఎరువులు దొరకక.. ఎరువుల దుకాణం ముందు పడిగాపులు కాస్తున్న రైతులను చూస్తే మనసు కలచివేస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితి గత ఐదేళ్లలో ఎప్పుడు రాలేదన్నారు. జగనన్న పాలనాకాలంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావలసిన ఎరువులు సుభిక్షంగా అందజేయడం జరిగిందన్నారు. జగనన్న పాలన రైతులకు ఒక స్వర్ణ యుగమని ఆయన అభివర్ణించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక రైతాంగం పరిస్థితి తారుమారు అయిందన్నారు. కరువు...చంద్రబాబు వీరిద్దరూ కవల పిల్లలని.. చంద్రబాబు అధికారంలోకి వస్తే కరువు కామన్ గా వచ్చేస్తుందన్నారు. రైతులకు ఎరువులు సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం దారుణంగా వైఫల్యం చెందిందని.. దీనికి ప్రధాన కారణం కూటమి నాయకులు ఎరువులను బ్లాక్ మార్కెట్కు తరలించడమే కారణంగా తెలుస్తుందన్నారు. అన్నం పెట్టే అన్నదాతలకు ఇబ్బందులు పెడితే ఈ కూటమి ప్రభుత్వానికి రైతన్నల ఉసురు తప్పక తగులుతుందన్నారు. రైతన్నలు ఎరువులు దొరకక ఇబ్బందులు పడుతుంటే కూటమి ప్రభుత్వ నాయకులకు అసలు పట్టడం లేదని.. రైతాంగం అంటే వీరికి గిట్టదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా రైతాంగానికి అవసరమైన ఎరువులు సరఫరా అయ్యే విధంగా కూటమి ప్రభుత్వ నాయకులు చర్యలు తీసుకోవాలని.. సొసైటీలకు.. దుకాణాలకు వస్తున్న ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా రైతన్నలకు విరివిగా అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు

Post a Comment

0 Comments