ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ప్రజా ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించాలి. ఎస్పీ

శ్రీకాకుళం, ఆగస్టు.25.పబ్లిక్ గ్రీవెన్స్ లో స్వీకరించే ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన విచారణ జరిపి,పూర్తి స్థాయిలో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి ఐపీఎస్ పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి 55 మంది ప్రజల నుంచి పిర్యాదులు స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి, ఫిర్యాదు దారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదు దారుల అర్జీలు,వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా తక్షణమే సంబధిత పోలీసు అధికారులకు తెలియ పరిచి చట్ట ప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని అదేశించారు.ప్రజా పిర్యాదులు పట్ల అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు.ఈ క్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా వృద్దులు వికలాంగుల అర్జీ దారులు తో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని ఎస్పి గారు అధికారులు ఆదేశించారు.పిర్యాదులు వివరాలు మొత్తం 55 స్వీకరించగా అందులో కుటుంబ సమస్యలు, మోసపూరితమైన,
ఆస్తి తగాదాల,సివిల్, ఇతరత్రా అంశాలపై స్వీకరించానన్నారు.

Post a Comment

0 Comments