ll ఎటువంటి చలనాలు చెల్లించకుండా ఉచితంగా పోలీసు వారు అనుమతులు పొందండి.ll
ll శ్రీకాకుళం టౌన్ డిఎస్పి సిహెచ్ వివేకానంద.ll
శ్రీకాకుళం, ఆగస్టు 25. శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో గణేష్ మండపాలు ఏర్పాటుకు ఎటువంటి చలానా చెల్లించకుండా ఉచితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన ఆన్లైన్లో https:// ganeshutsav.net
ద్వారా పోలీసు వారి అనుమతులు పొంది పోలీస్ శాఖ జారీ చేసిన భద్రత నిబంధనలు జాగ్రత్తలు కమిటీ నిర్వాహకులు తూచా తప్పకుండా పాటించాలని ఈ మేరకు సోమవారం శ్రీకాకుళం టౌన్ డిఎస్పి సిహెచ్ వివేకానంద ఓ పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.
*వినాయక విగ్రహ ప్రతిష్ట సందర్బంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు*
🌀 వినాయక విగ్రహ ప్రతిష్ఠ/ పందిళ్ళు/ మండపాలు ఏర్పాటకు ఆన్లైన్లో https://ganeshutsav.net
ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ వారి ముందస్తు అనుమతులు పొందాలి.
🌀 పైర్,విద్యుత్ శాఖల అనుమతితో పాటు వారు సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి పందిళ్ళు / మండపాలు వద్ద ఇసుక మరియు నీళ్ళను ఏర్పాటు చేసుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. నిమజ్జన సమయంలో విద్యుత్ తీగలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
🌀 విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన మార్గం మరియు విగ్రహ నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలను కూడా తెలియజేయాల్సి ఉంటుంది. పోలీసులు అనుమతించిన నిమజ్జన మార్గాలలోనే విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకొని వెళ్లాలి.
🌀 గణేష్ మండపాలు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి.
🌀పందిళ్ళు,మండపాలు వద్ద శబ్దకాలుష్య క్రమబద్దీకరణ మరియు నియంత్రణ నింబంధనలు ప్రకారం ఇతరులకు ఇబ్బంది కలగకుండా స్పీకర్లను ఉపయోగించాలి. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉపయోగించాలి.
🌀 మండపాల వద్ద క్యూ లను మేనేజ్ చేసే భాధ్యతను పోలీసు శాఖ తో పాటు ఆర్గనైజయింగ్ కమిటీ సహాయ సహకారాలు ఎంతైనా అవసరం.
🌀 రాత్రి సమయాల్లో మండపాల వద్ద విధిగా ఆర్గనైజింగ్ కమిటీ వారి ప్రతినిధులు కాపలా ఉండాలి. వినాయక పందిళ్ళు గాని, విగ్రహం పెట్టే ప్రదేశంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి.
🌀 పోలీసు వారు అనుమతులు లేనిదే డీజేలు ఏర్పాటు చేస్తే చట్ట ప్రకారం సీజ్ చేయడం జరుగుతుంది. విగ్రహ నిమజ్జన ఊరేగింపు సమయంలో వేషధారణలు ముందుగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.
🌀 పోలీసు వారు ఎంపిక చేసిన సురక్షితమైన నిమజ్జనం ప్రదేశాలలో మాత్రమే విగ్రహాలను నిమజ్జనం చేయాలి నిమజ్జన సమయంలో ఆయా ప్రదేశాల్లో చిన్న పిల్లలు ఉండకూడదు.
🌀 భద్రత దృష్ట్యా పోలీసు వారితో నిమజ్జన కమిటీ సభ్యులు సమన్వయం చేసుకుంటూ నిమజ్జన కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
0 Comments