ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

బాల్య వివాహాలు సమాజానికి శాపం.న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు

గార, ఆగస్టు 26: బాల్య వివాహాలు బాలికల జీవితాలను నాశనం చేస్తాయని, ఇది సమాజానికి శాపం లాంటిదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు గార మండలం, బందరువానుపేటలో మత్స్యకారుల కోసం నిర్వహించిన బాల్య వివాహాలు, చిన్న వయసులో గర్భధారణ వల్ల కలిగే నష్టాలపై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
బాల్య వివాహాల వల్ల బాలికలు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారని, ఇది వారి భవిష్యత్తును దెబ్బతీస్తుందని హరిబాబు తెలిపారు. చిన్న వయసులో గర్భధారణ జరిగితే తల్లి, పుట్టబోయే బిడ్డ ఇద్దరూ అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించి, ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించాలని సూచించారు. ఏదైనా న్యాయపరమైన సహాయం కావాలంటే 15100 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీపీవో కె. రమణ, ఏపీసీ ఎస్. శశిభూషణ్, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments