ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

మహిళలకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లో శిక్షణ. ఆశక్తి గల ఎస్సీ మహిళలు ధరఖాస్తు చేసుకోవాలి.

*మహిళలకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లో శిక్షణ*

*ఆశక్తి గల ఎస్సీ మహిళలు ధరఖాస్తు చేసుకోవాలి*

*సెప్టెంబర్ 5 తేదీన దరఖాస్తు చేయుటకు ఆఖరు*

*ఎస్సీ కార్పొరేషన్ ఇడి గడ్డెమ్మ*

శ్రీకాకుళం,ఆగస్టు,30: ఎస్సీ మహిళలకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఇడి గడ్డెమ్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్.సి మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం కింద PMAJAY- 2023-24 ఆర్ధిక సంవత్సరంలో హెవీ మోటార్ వెహికల్ డ్రైవర్ ట్రైనింగ్ (Heavy Motor Vehicle Driver Training)నకు సంబందించి జిల్లాలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన 20 సం.ల వయస్సు పైబడిన 5గురు మహిళ అభ్యర్ధులుకు మాత్రమే హెవీ మోటార్ వెహికల్ డ్రైవర్ ట్రైనింగ్ (Heavy Motor Vehicle Driver Training) లో 40 రోజులు పాటు APPTD (APSRTC) వారి ద్వారా శిక్షణ ఇచ్చుటకు ప్రభుత్వం నిర్ణయించడమైనదన్నారు. 
ఇందుకు సంబంధించి అర్హతలు: 
శ్రీకాకుళం జిల్లా నివాసులై కుల, ఆదాయ నివాస దృవపత్రములు మరియు ఆధార్ కార్డు కలిగి ఉండాలని, కనీసం 1 సంవత్సరం కాలపరిమితి గల లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ (LMV) లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. ధరఖాస్తుదారుని వయస్సు 20 సంవత్సరముల పైబడి ఉండవలెను. 40 సంవత్సరములు పైబడిన 2 మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలని, HMV LLR పొందుటకు అవసరమైన రుసుం రూ.210/- లు అభ్యర్ధులు చెల్లించాలన్నారు. HMV Driving License పొందుటకు అవసరమైన రుసుము రూ.1060/-లు అభ్యర్ధులు చెల్లించాలని వివరించారు. అర్హులైన ఎస్.సి. మహిళలు, కార్యనిర్వాహక సంచాలకులు, జిల్లా షెడ్యుల్డు కులముల సేవా సహకార సంఘం., శ్రీకాకుళం వారి కార్యాలయంలో దరఖాస్తును సెప్టెంబర్ 5న సాయంత్రం 5 గంటలు లోగా సమర్పించ వలసినదిగా తెలియజేశారు. ఇతర వివరములుకై సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: 9704895271, 7981766308.

Post a Comment

0 Comments