ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

22న డ్రోన్ పైలెట్ ఉద్యోగాలకు ఎంపికలు.



శ్రీకాకుళం, సెప్టెంబర్ 18 :ఈ నెల 22వ తేదీన శ్రీకాకుళం పట్టణంలోని అభ్యుదయ డిగ్రీ కాలేజ్‌లో డ్రాగ్ డ్రోన్స్ ప్రైవేట్ కంపెనీకి సంబంధించి డ్రోన్ పైలెట్ ఉద్యోగాల కోసం ఎంపిక జరుగుతుందని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఉరిటి సాయికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి లేదా అంతకంటే పై చదువు పూర్తి చేసిన 18 నుండి 28 ఏళ్ల మధ్య వయస్సు గల పురుషులు అర్హులని ఆయన పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలలపాటు శిక్షణ ఇవ్వబడుతుందని, ఈ కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యాలతో పాటు నెలకు రూ.5 వేల స్టైపెండ్ అందజేస్తామని చెప్పారు. శిక్షణ అనంతరం నెలకు రూ.22 వేల జీతంతోపాటు ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఎంపికైన వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేయవలసి ఉంటుందని ఆయన వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ రెజ్యూమ్, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో ఉదయం 9 గంటలకు అభ్యుదయ డిగ్రీ కాలేజ్‌లో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 95509 67353 నంబరును సంప్రదించాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి తెలిపారు.

Post a Comment

0 Comments