ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

14న గృహనిర్మాణ శాఖ మంత్రి సమీక్ష-జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి.లాఠకర్ –

ప్రజా పత్రిక-శ్రీకాకుళం, జూన్ 11 : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి  సిహెచ్.శ్రీరంగనాథ రాజు  జిల్లాలో అమలవుతున్న నవరత్నాలు – పేదలందరకీ ఇళ్లు పై సంబంధిత అధికారులతో ఈ నెల 14న సమీక్షించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి.లాఠకర్ పేర్కొన్నారు.  ఈ మేరకు కలెక్టర్ శుక్రవారం ఒక ప్రకటన జారీచేసారు. జూన్ 14వ తేదీ ఉదయం 10.30గం.లకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు.                           ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు హాజరవుతారని చెప్పారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు రెవిన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖామాత్యులు  ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్, రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మరియు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రివర్యులు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని )  , రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు హాజరుకావచ్చని కలెక్టర్ ఆ ప్రకటనలో వివరించారు.

Post a Comment

0 Comments