ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

రక్త దానం మహా దానం

శ్రీకాకుళం : రక్త దానం మహా దానం అని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ అన్నారు. ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ రక్త నిల్వ కేంద్రం (బ్లడ్ బాంక్) లో సోమవారం జరిగిన రక్త దానం శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. రక్త దానం చేసిన వ్యక్తులను అభినందించారు. ప్లాస్మా దానం చేసిన వ్యక్తులకు రెడ్ క్రాస్ మెడల్స్ ను బహూకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ రక్త దానం దినోత్సవం సందర్భంగా రక్త దానం చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రక్త దానం చేయడం అంటే గొప్ప పని చెందినట్లు గుర్తించాలని అన్నారు. రక్త దానంతో ప్రాణాలు కాపాడుతున్నారని అది గొప్ప సహాయంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. రక్తం స్వీకరించిన వ్యక్తికి రక్త దానం చేసిన వ్యక్తితో అనుకోకుండా రక్త సబంధం ఏర్పడుతుందని ఆయన చెప్పారు.  రెడ్ క్రాస్ లో 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు కూడా రక్త దానం చేస్తున్నారని పేర్కొంటూ యువత పెద్ద ఎత్తున రక్త దానం చేయుటకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన వ్యక్తిగా రక్త దానం చేసి జిల్లా వాసుల ప్రాణాలు కాపాడుటకు ముందుకు రావాలని కలెక్టర్ కోరారు. రక్తం అవసరమైన వారిలో మన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కూడా ఉంటారని శ్రీకేశ్ పేర్కొన్నారు. అన్ని దానాలలోకి రక్త దానం గొప్పదని అన్నారు. 

ఈ సందర్భంగా సింగపూర్ రెడ్ క్రాస్ అందించిన 10 లీటర్ల చొప్పున సామర్థ్యం గల 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అందించిన 5 లీటర్ల సామర్ధ్యం గల 5 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కలెక్టర్ ప్రారంభించారు. 

జర్నలిస్ట్ శాస్త్రి రక్త దానం చేసిన వారిలో ఉన్నారు. 

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ పి. జగన్మోహన్ రావు, రెడ్ క్రాస్ సభ్యులు డాక్టర్ కె.సుధీర్, బి.మల్లేశ్వరరావు, రాజేంద్ర కర్ణాని, డా.నిక్కు అప్పన్న, లక్ష్ము నాయుడు, నిక్కు హరి సత్యనారాయణ, కోటేశ్వరరావు, సత్యనారాయణ, విజయ్, శ్రీకాంత్, స్టార్ వాకర్స్ సభ్యులు కె.వి.రమణ మూర్తి, జి.ఇందిరా ప్రసాద్, ఎస్.జోగి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments