శ్రీకాకుళం : డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 25 వినతులు అందాయని జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని స్పందన విభాగంలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం డి.ఆర్.ఓ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖకు చెందినవి 9 కాగా, రెవిన్యూ విభాగం 4, ఇతర శాఖలవి 12 ఉన్నట్లు డి.ఆర్.ఓ తెలిపారు. ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుండి జెడ్.పి.టి.సి మెంబరు ఉప్పాడ నారాయణమ్మ ఫోన్ చేసి మాట్లాడుతూ కంచిలి మరియు కవిటి పంచాయతీలకు చెందిన సర్వేయర్లు సర్వే చేయడంలేదని, కావున సర్వే చేయించవలసినదిగా కోరారు.సంతకవిటి మండలం తాలాడ నుండి ముగ్గు సరస్వతి మాట్లాడుతూ అంగన్వాడీ భవనం ప్రహరీగోడ, మురుగునీటి కాల్వలు, షెడ్, బర్రెల గ్రౌండు పనులు పూర్తిచేసి యం.బుక్ లో నమోదుచేయడం జరిగినప్పటికీ ఇంతవరకు బిల్లులు చెల్లించలేదని ఫిర్యాదు చేసారు. భామిని మండలం పెద్దదిమిలి నుండి బి.జయరామ్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రానికి విత్తనాలు వచ్చినప్పటికీ రైతులకు విత్తనాలను అందజేయడం లేదని ఫిర్యాదు చేసారు. బూర్జ మండలం చీడివలస నుండి కలగ పద్మ ఫోన్ చేస్తూ కొల్లివలస సచివాలయం వాలంటీరుపై తప్పుడు సమాచారం చెప్పి రాజకీయ ఒత్తిడితో విధుల నుండి తొలగించారని, దీనిపై తగు విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. గార మండలం బలరాంపురం నుండి తురాడ గుర్రమ్మ ఫోన్ చేసి మాట్లాడుతూ చేయూత పథకం తనకు అందడం లేదని, కావున తనకు తగిన న్యాయం చేసి చేయూత పథకాన్ని వర్తింపచేయాలని కోరారు. యల్.యన్.పేట మండలం రావిచంద్రి నుండి పల్లి సూరమ్మ మాట్లాడుతూ తనకు రావిచంద్రి రహదారి ప్రక్కన 0.52 సెంట్ల స్థలం ఉందని, దానికి సంబంధించి 1బి అడంగళ్ ను మంజూరుచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
0 Comments