ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఆక్సిజన్ వృధా కాకూడదు.3వ దశకు ముందస్తు ప్రణాళిక

శ్రీకాకుళం, జూన్ 9 :  ఆక్సిజన్ వృధా కాకూడదని జిల్లా కలెక్టర్  శ్రీకేశ్ బి లాఠకర్ పేర్కొన్నారు. 3వ దశకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. కరోనా పరిస్థితులు, మూడవ దఫాపై సంబంధిత అధికారులతో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. లాబ్ లో ఎక్కువ నమూనాలు లేనప్పుడు నమూనాల పెండింగ్  ఉండరాదని ఆయన స్పష్టం చేసారు. ఆక్సిజన్ అవసరాలను ఖచ్చితంగా అంచనా వేయాలని ఆయన ఆదేశించారు. కోవిడ్ కేర్ కేంద్రాలలో ఆక్సిజన్ సిలిండర్లు పెట్టాలని, ఆకస్మికంగా అత్యవసర సమయాలు సంభవిస్తే వినియోగించవచ్చని పేర్కొన్నారు. మూడవ దఫా కోవిడ్ సంభవిస్తే ఎదుర్కొనుటకు అవసరమగు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, సిలిండర్లు నిల్వ చేయుటకు ఒక గిడ్డంగిని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు, హోమ్ ఐసోలేషన్ కిట్లు పంపిణీ సక్రమంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అన్నారు. హోమ్ ఐసోలేషన్ నుండి ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి ఉండరాదని ఆయన చెప్పారు. ఆశా కార్యకర్తలు, ఏ.ఎన్.ఎంలు, వాలంటీర్లు ప్రతి రోజు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారిని సందర్శించాలని ఆయన ఆదేశించారు. కాంటాక్ట్ ట్రేసింగ్, ట్రయేజింగ్ పకడ్బందీగా చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. 104 కాల్ సెంటర్ ద్వారా వచ్చిన కాల్స్ కు ఆరు గంటల్లో పరిష్కారానికి కృషి చేయాలని ఆయన స్పష్టం చేశారు. 
వాక్సినేషన్ కార్యక్రమంలో ఫ్రంట్ లైన్ వర్కర్లు అందరికి వేయుటకు డ్రైవ్ పెట్టాలని సూచించారు. సాధారణ ప్రజానీకానికి వాక్సినేషన్ పై అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు. 


ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి మరియు కోవిడ్ నమూనా పరీక్షల అధికారి సి.హెచ్. శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలో రెండు లాబ్ ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. లాబ్ లలో 
6 మెషీన్లు ఉన్నాయని, రోజుకు 5 వేల ఆర్.టి.పి.సి.ఆర్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు సకాలంలో అందిస్తున్నామని వివరించారు. లాబ్ లు ఏర్పాటు చేసిన నాటి నుండి 
7,86,124 పరీక్షలు నిర్వహించామన్నారు. 

జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు మాట్లాడుతూ జిల్లాలో 
38 టన్నుల నిల్వ సామర్ధ్యం ఉందన్నారు.రిమ్స్ లో ఒక పి.ఎస్.ఏ యూనిట్ ను  ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆక్సిజన్ వృధా కాకూడదన్నారు. పేషెంట్లు కు ఆక్సిజన్ వాడకం పై అవగాహన కల్పించాలని సూచించారు. 

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, జిల్లా అటవీ అధికారి సందీప్ కృపాకర్ , జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సి.చంద్ర నాయక్, వివిధ విభాగాల నోడల్ అధికారులు జి.జయదేవి, సీతారామయ్య, డా.హేమంత్, డా.కె.చలమయ్య, ఐ. కిషోర్, హెచ్.కుర్మారావు, ఎం.మోహన రావు, జి.శ్రీనివాసరావు, డా.లీల, డా.వడ్డి సుందర్, బి.లక్ష్మీపతి, డా.బి.జగన్నాథ రావు తదితరులు తమ విభాగాలు చేపడుతున్న పనులను వివరించారు.

Post a Comment

0 Comments