ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

చిన్నారుల వైద్యం పై దృష్టి కేంద్రీకరించాలి

శ్రీకాకుళం, జాన్ 9 : మూడవ దఫా కరోనా వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ అన్నారు. రెండవ దఫాలో మంచి సేవలు అందించారని తెలుసుకున్నామని ఆయన పేర్కొంటూ అదే స్ఫూర్తితో పని చేయాలని కోరారు. మూడవ దఫా కరోనా వ్యాప్తి చెందితే దానిని సమష్టిగా ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మూడవ దఫా చిన్నారులపై ప్రభావం ఉంటుందని సూచనలు వస్తున్నాయని అందుకు అవసరమైన సదుపాయాలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుత పతిస్థితి, కోవిడ్ సమయంలో చర్యలను విశ్లేషణ చేయాలని అన్నారు. ఇప్పటికే దేశంలో వివిధ ప్రాంతాల్లో కేసులు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని వాటిని పరిశీలించాలని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాకు రిమ్స్, జెమ్స్ ప్రధానమైనవని ఆయన అన్నారు. బుధవారం రిమ్స్ లో వైద్యులతో కరోనా పరిస్థితులు, మూడవ దఫా, బ్లాక్ ఫంగస్ తదితర అంశాలపై సమీక్షించారు.

అనంతరం కంట్రోల్ రూమ్ ను సందర్శించి కోవిడ్ బాధితులకు అందుతున్న చికిత్సను పరిశీలించారు. కంట్రోల్ రూమ్ పని తీరును గమనించారు.


ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డా.కె.శ్రీనివాసులు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ఏ.కృష్ణ మూర్తి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.ఏ.కృష్ణ వేణి ఇతర వైద్యులు పాల్గొన్నారు.అజ్,1ఆ,1

Post a Comment

0 Comments