శ్రీకాకుళం,జూన్ 9: రాష్ట్రంలో వంద సంవత్సరాల తరువాత సమగ్ర భూ సర్వే జరుగుతోందనిరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ అన్నారు. పొలాకి మండలం సంత లక్ష్మీ పురం గ్రామంలో వై.యస్.ఆర్. జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్ష కార్యక్రమంను బుధవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వంద సంవత్సరాల తరువాత సమగ్ర భూ సర్వే జరుగుతోందన్నారు. జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లాలో రీ సర్వే కార్యక్రమం విజయవంతం కాగలదని పేర్కొన్నారు. రెవెన్యూ మంత్రిగా 30 లక్షలు ఇళ్ల పట్టాలు అందించే అదృష్టం కలిగిందని పేర్కొన్నారు.
డ్రోన్లు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీ సర్వే జరుగుతోందని చెప్పారు. చాలా ఖచ్చితత్వంతో సర్వే జరుగుతుందని ఆయన తెలిపారు. 2022 అక్టోబరు నాటికి రాష్ట్రంలో రీ సర్వే పూర్తి చేయుటకు లక్ష్యంతో ఉన్నామని చెప్పారు. తప్పులు లేకుండా రికార్డులు తయారు చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు. గ్రామ సచివాలయంలోనే భూ రిజిస్ట్రేషన్ జరగాలని ముఖ్యమంత్రి నిర్ణయం అని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలసి పనిచేస్తూ ప్రజలకు మంచి సేవలు అందిస్తామని చెప్పారు.
జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయుటకు
మూడు గ్రామాలు ఎంపిక చేశామన్నారు. ప్రస్తుతం భూములపై
భూ వివాదాలు ఉండవచ్చని అన్నారు. ఇ క్రాప్, పంట రుణాలు తదితర అంశాలపై సమస్యలు వస్తున్నాయని ఇటువంటి వివాదాలు
వంద శాతం పరిష్కారం అవుతుందని వివరించారు. సర్వే ద్వారా గ్రామ భూసరిహద్దు నిర్ణయం జరుగుతుందని పేర్కొన్నారు. భూ
సర్వే నంబర్లు వారిగా ప్రభుత్వ, జిరాయితి వివరాలు తెలుస్తుందని ఆయన చెప్పారు. సర్వే అనంతరం
ఇంటింటికి భూమి వివరాలు తెలుపుతూ నోటీస్ లు ఇస్తామని అనంతరం తుది డేటా బేస్ తయారు చేస్తామని తెలిపారు. జిల్లాలో
ఒక్కొక్క మండలంలో ఒక గ్రామంలో రీ సర్వేకు ఎంపిక చేశామని ఆయన చెప్పారు. జిల్లాలో 250 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేసామని అన్నారు. రీ సర్వే కార్యక్రమంలో ప్రతి రైత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
పొలాకి మండలం
సంత లక్ష్మీపురం గ్రామంలో 98 సర్వే నంబర్లలో 378.84 ఎకరాల విస్తీర్ణంలో రీ సర్వే చేపడుతున్నారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఐ. కిషోర్, సర్వే సహాయ సంచాలకులు కె.ప్రభాకర్, తహసీల్దార్ సింహాచలం, ఎం.పి.డి.ఓ డబ్లు.రాధాకృష్ణ, సర్పంచ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments