ప్రజా పత్రిక-పాలకొండ:భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ నడిపేన రామారావు కి సిపిఐ పార్టీ పాలకొండ నియోజకవర్గం కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మెమోరాండం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు మున్సిపల్ ప్రజలపై భారం మోపే జీవో నెంబరు 196 197 198 లను తెచ్చినప్పటికీ రాష్ట్రంలో అన్ని మున్సిపాల్టీల్లో వై ఎస్ ఆర్ సి పి గెలిచిన తర్వాత ప్రజల పై భారం మోపే జీవోలను అమలు చేయడానికి పూనుకోవడం ప్రజలును మోసపుచ్చడం సరికాదని అన్నారు. కరోన భయంతో ప్రజలందరూ ప్రాణాలు గుప్పిట్లో ఉంచుకొని ఆదాయ మార్గాలు లేక బిక్కుబిక్కుమని బ్రతుకుతూ ఉంటే వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం భారాలను మాపడం ఎంత వరకు తగునని ప్రశ్నించారు.రాబోయే కాలంలో పట్నంలో కలసివచ్చే సంఘాలను ,రాజకీయ పార్టీలు, ప్రజలతో భారాలు తగ్గేవరకు ఉద్యమం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు వండాన కూర్మారావు పాల్గొన్నారు.
0 Comments