ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

మొదటి దశ గ్రహాలు మార్చి నాటికి పూర్తి.రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీ రంగనాధ రాజు వెల్లడి

* దేశ చరిత్రలో 30 లక్షల ఇళ్ల నిర్మాణం ఒక చారిత్రాత్మకం
* ప్రతీ గ్రామానికి నోడల్ అధికారి
* జగనన్న కాలనీల్లో భూ గర్భ డ్రైనేజి, విద్యుత్, ఇంటర్నెట్
* మొదటి దశ గృహాలు వచ్చే మార్చి నాటికి పూర్తి
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీ రంగనాధ రాజు వెల్లడి
     శ్రీకాకుళం : దేశ చరిత్రలో 30 లక్షల ఇళ్ల నిర్మాణం ఒక చారిత్రాత్మకమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీ రంగనాధ రాజు వెల్లడించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు, వై.యస్.ఆర్ జగనన్న కాలనీల గృహనిర్మాణం పై సమీక్ష అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై. యస్. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఆయన నెరవేర్చుతున్నారని పేర్కొన్నారు.  గృహాలను నిర్మించుకొనేందుకు లబ్దిదారులు ఎవరైనా ముందుకు వస్తే వారికి సిమెంటు, ఇనుము, తదితర మెటీరియల్ సరసమైన ధరలకు ప్రభుత్వమే సరఫరా చేస్తుందని చెప్పారు. జగనన్న కాలనీలలో భూ గర్భ డ్రైనేజ్ లు, విద్యుత్ లైన్లు, ఇంటర్నెట్ ఉంటుందన్నారు.  కులాయి కనెక్షన్లు, అంగన్ వాడీ కేంద్రాలు, తదితర మౌళిక సౌకర్యాలతో కాలనీలు ఉంటాయని తెలిపారు.  ప్రతీ గ్రామానికి ఒక మండల స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించనున్నట్లు పేర్కొన్నారు.  మండల స్థాయి అధికారులు ఉంటే త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకొనేందుకు అవకాశం ఉంటుందన్నారు.  రాష్ట్ర స్థాయిలో ఏ ఒక్క పేద వారు ఇళ్లు లేకుండా మిగల కూడదని ముఖ్యమంత్రి లక్ష్యమని స్పష్టం చేశారు. మొదటి విడత  గృహ నిర్మాణాలు వచ్చే మార్చి 31 నాటికి పూర్తి చేయనున్నట్లు చెప్పారు.    ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, పాడిపరిశ్రమాభిద్థి, మత్య్స శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments