ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

' కారా ' మృతికి డిప్యూటీ సీఎం సంతాపం

ప్రజా పత్రిక:శ్రీకాకుళం, జూన్ 4: ప్రముఖ కథారచయిత, కథానిలయం వ్యవస్థాపకులు డాక్టర్ కాళీపట్నం రామారావు (కారా) మృతికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్యానికి విశేషకృషి చేసిన ' కారా ' చిరస్మరణీయులన్నారు. కథారచనలో ఎందరికో మార్గదర్శిగా నిలిచిన కారా మాస్టారు ఎంతో నిరాడంబరమైన జీవితాన్నిగడిపి, తన జీవితాన్నంతా కథలకు, కథానిలయానికే అంకితం చేశారన్నారు. ఆయన కుటుంబసభ్యులందరికీ తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని కృష్ణదాస్ చెప్పారు.

Post a Comment

0 Comments