ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

కార్పొరేట్ల బారినుండి వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జీవో కాఫీ దగ్ధం.

ప్రజా పత్రిక-నరసన్నపేట:లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ సంపూర్ణ విప్లవానికి పిలుపునిచ్చిన దినం పురస్కరించుకొని కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్న రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని ఉద్యమం వంద రోజులు పూర్తి కావస్తున్న సందర్భంగా ఆల్ ఇండియా కిసాన్ సంఘర్షణ కోఆర్డినేషన్ కమిటీ దేశవ్యాప్తంగా  పిలుపుమేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నరసన్నపేటలో రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు జీవో కాఫీ దగ్ధం కార్యక్రమం నిర్వహించారు. ఈ  ఆందోళన  కార్యక్రమానికి సి ఐ టి యు పూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కరగాన  కొండయ్య సిఐటియు జిల్లా కార్యదర్శి వై చలపతిరావు మాట్లాడుతూ రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని పోరాటం ఒక రైతాంగ సమస్య గా చూడకూడదని, దేశం యావత్తు ప్రజానీకం ఆహార భద్రత ముప్పు వాటిల్లే సమస్యగా చూడాలని ఈ చట్టంలో నిత్యావసర వస్తువుల చట్టం లో బ్లాక్ మార్కెట్లో నిత్యవసర వస్తువులు కార్పొరేట్ లు ,ప్రైవేట్ వ్యాపారస్తులు ఎంతైనా దాసు కోవచ్చు నని చట్టంలో పేర్కొనడంతో భవిష్యత్తులో ప్రజలకు ఆహారభద్రత కుత్రిమ కొరత ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ వ్యవసాయాన్ని తీసుకు రావడం ద్వారా రైతు భూమిలో రైతే కట్టు బానిసగా మారే అవకాశాలున్నాయని తెలిపారు. రైతులకు మద్దతు ధర ఈ చట్టంలో పేర్కొన్నకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పదహారు సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో ఆక్సిజన్ బ్లెడ్ లు లేక ప్రజలు  ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ మందుల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యాక్సిన్ ఒక రేటు, మందు డ్రగ్స్ మాఫియా కు ఒక రేటు, ప్రజలకు అమ్మడానికి  ఒక రేటు కేంద్ర ప్రభుత్వం సూచించడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే నని, అదే సందర్భంలో అమెరికాకు వ్యాక్సిన్  మందులు ఎగుమతులు చేయడం ఇదేనా మోడీ దేశభక్తి అని ప్రశ్నించారు. ప్రశ్నించే శక్తుల పైనా అభ్యుదయవాదులు పైన జర్నలిస్టుల పైన దాడులు హత్యలకు మోడీ ప్రభుత్వం పూనుకుంటుందని మరోవైపు సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే చర్యలు తీవ్రమవుతున్నాయి ఎమర్జెన్సీ రోజుల్లో గుర్తు వచ్చే విధంగా ఉందని ఇటీవల ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజా తీర్పు ఇచ్చినది గుర్తు చేసుకోవాలని భవిష్యత్తులో అనాలోచిత నిర్ణయాలు మార్చకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి  జోగి గన్నయ్య,అప్పన్న, రంగా, పాపారావు, కృష్ణారావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments